YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బుద్ధా వెంకన్న ఫైర్ ఎందుకు

బుద్ధా వెంకన్న ఫైర్ ఎందుకు

విజయవాడ, మార్చి 20,
టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయం అంతా ఫెయిర్ గా ఉండదు. వెనకనుంచి తొక్కేయడమే. విజయవాడ ఎంపీ కేశినేని నాని విషయంలోనూ ఇప్పుడు అదే జరిగింది. కేశినేని నాని పై టీడీపీ నేతలు మాటల దాడి చేయడం వెనక చంద్రబాబు ఉన్నారన్న అనుమానం కేశినేనికి లేకపోలేదు. ఎందుకంటే తనకు వ్యతిరేకంగా మాట్లాడిన నేతలంతా చంద్రబాబుకు వీర భక్తులు. బోండా ఉమ, నాగుల్ మీరాలను పక్కన పెడితే బుద్దా వెంకన్న ఫైర్ అవ్వడం వెనక చినబాబు, పెదబాబు ఉన్నారన్న అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి.బుద్దా వెంకన్న ఎప్పుడూ పార్టీ లైన్ దాటరు. అధికారంలో ఉన్నప్పుడు కాని, లేనప్పుడు కాని ఆయన పార్టీ అధినాయకత్వానికి నమ్మిన బంటుగా వ్యవహరిస్తారు. ఎందుకంటే ఇరవైఏళ్లుగా విజయవాడలో టీడీపీ జెండా పట్టుకుని తిరిగిన తనకు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో బుద్దా వెంకన్నకు మరింత భక్తి పెరిగింది. పైగా బుద్దా వెంకన్న కుమారుడు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తో సన్నిహితంగా ఉంటారు.బుద్దా వెంకన్న నిజానికి ఒక వార్డు స్థాయికి పరిమితమైన నేత. అయినా చంద్రబాబు బుద్దా వెంకన్నలో ఉన్న ఫైర్ ను గుర్తించి ఎమ్మెల్సీని చేశారు. అటువంటి బుద్దా వెంకన్న ఎంపీ కేశినేని నానిని చెప్పతో కొడతానన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారంటే పెద్దల అండదండలు లేవని ఖచ్చితంగా చెప్పలేం. అదీ మున్సిపల్ ఎన్నికలు జరిగే వేళ ఈ కామెంట్స్ కావాలనే చేశారని, కేశినేని నానిని కంట్రోల్ లో పెట్టడానికే బుద్దా వెంకన్న ద్వారా నడిపించారన్న టాక్ వినిపిస్తుంది.అందుకే బుద్దా వెంకన్న అన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసినా వెంటనే చంద్రబాబు జోక్యం చేసుకున్న వెంటనే వివాదం సద్దుమణిగినట్లు కన్పించింది. అయితే ఇది తాత్కాలికమేనని అంటున్నారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు పూర్తయిన వెంటనే మరోసారి వివాదం తలెత్తే అవకాశముంది. కేశినేని నాని కూడా తన కూతురు మేయర్ గా ఎన్నిక అవ్వడం కోసమే మౌనంగా ఉన్నారంటున్నారు. ఎన్నికల తర్వాత బెజవాడ టీడీపీ లో మరిన్ని రక్తికట్టే సన్నివేశాలు చూస్తామన్నది వాస్తవం

Related Posts