YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వంశీకృష్ణ... దురదృష్టవంతుడు

వంశీకృష్ణ... దురదృష్టవంతుడు

విశాఖపట్టణం, మార్చి 20, 
అవును. అవకాశాలు రావాలంటే ఆవ గింజ అయినా అదృష్టం ఉండాలి. లేకపోతే ఏళ్ళకు ఏళ్ళు పడిగాపులు కాసినా ఫలితం మాత్రం ఉండదు. ఇపుడు విశాఖలో ఈ విషయంలో ఒకరి గురించి గట్టిగానే చెప్పుకుంటున్నారు. ఆయనే వైసీపీ సీనియర్ నేత వంశీ క్రిష్ణ శ్రీనివాస్. చిరంజీవి అభిమానిగా ఉంటూ విశాఖలో సేవా కార్యక్రమాలు చేసుకునే వంశీ క్రిష్ణ శ్రీనివాస్ అదే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చాడని తెలిసి తానూ ప్రజారాజ్యంలో చేరిపోయారు. అలా రాజకీయాన్ని వంటబ‌ట్టించుకున్న వంశీ 2009 ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి ఆ పార్టీ నుంచి పోటీ చేసి జస్ట్ మూడు వేల తేడాతో ఓడిపోయారు.అలా మొదటిసారి లక్ రివర్స్ అయినా మొక్కవోని దీక్షతో వంశీ క్రిష్ణ శ్రీనివాస్ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఆయన వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో మళ్ళీ తూర్పు నుంచి పోటీ చేశారు. అయినా ఓటమి పాలు అయ్యారు. 2019 ఎన్నికల వేళ ఆయనకు టికెట్ దక్కలేదు. దానికి బదులుగా జీవీఎంసీ మేయర్ పదవి ఇస్తామని నాడు హై కమాండ్ హామీ ఇచ్చింది. తీరా ఇపుడు జీవీఎంసీ ఎన్నికలు అయ్యాయి. కార్పోరేటర్ గా వంశీ క్రిష్ణ శ్రీనివాస్ గెలిచారు. కానీ మేయర్ సీటు మాత్రం ఆయనకు దక్కకుండా పోయింది. చివరి నిముషంలో మారిన పరిణామాల నేపధ్యంలో వంశీకి కాకుండా అనూహ్యంగా 11వ వార్డుకు చెందిన మహిళా కార్పొరేటర్ గొలగాని వెంకట హరి కుమారిని తెచ్చి ప్రమాణం చేయించారు.దీనితో వంశీ క్రిష్ణ శ్రీనివాస్ పన్నెండేళ్ళ రాజకీయానికి ఫుల్ స్టాప్ పడ్డట్టేనా అన్న చర్చ అయితే సాగుతోంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాయకుడు మేయర్ సీటు కోసమే కార్పోరేటర్ గా బరిలోకి దిగాడు. ఇపుడు మేయర్ పదవి దక్కలేదు. వట్టి కార్పొరేటర్ గా కాలం వెళ్లదీయడం కంటే దారుణం మరోటి లేదు. ఒకవేళ కొనసాగినా 2024 నాటికి విశాఖ తూర్పు ఎమ్మెల్యే సీటు వస్తుంది అన్న నమ్మకం లేదు అది ఇప్పటికే 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన అక్రమాని విజయనిర్మలకు ఆ సీటు రిజర్వ్ అయింది. దాంతో దారులు అన్నీ మూసుకుపోయాయి. మరి వంశీ క్రిష్ణ శ్రీనివాస్ కార్పొరేటర్ గానే తన రాజకీయానికి ముగింపు పలుకుతారా అన్నదే చర్చ.అయితే వంశీ క్రిష్ణ శ్రీనివాస్ కి మేయర్ పదవి ఇస్తామని చెప్పి వైసీపీ హై కమాండ్ హ్యాండ్ ఇచ్చింది అన్న మాటను ఆయన అనుచరులు అంటున్నారు. కానీ హామీ ఇచ్చినా ఆయన 2019 ఎన్నికల్లో సరిగ్గా పనిచేయకపోవడం వల్లనే తూర్పులో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి ఓడారు అని వైసీపీ హై కమాండ్ అనుమానిస్తోంది. పైగా ఆయనకు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ తో పాటు, టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయాని కూడా అనుమానాలు కూడా ఉన్నాయట. ఇవన్నీ కలిసే వంశీ క్రిష్ణ శ్రీనివాస్ ని పెద్ద పదవి నుంచి దూరం చేశాయని అంటున్నారు. మొత్తానికి వంశీ క్రిష్ణ శ్రీనివాస్ రాజకీయం ఇలా కావడానికి ఆయన చేసుకున్నదే ఎక్కువగా ఉందని కూడా అంటున్నారు.

Related Posts