YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మహిళా నేతల వాయిస్..ఆగిపోయిందే

మహిళా నేతల వాయిస్..ఆగిపోయిందే

గుంటూరు, మార్చి 20, 
జగన్ పదవులు ఇస్తారు కాని పెద్దగా పట్టించుకోరు. అధికారంలో లేనప్పుడు పార్టీకి బాగా ఉపయోగపడిన ఈ మహిళానేతలిద్దరూ ఇప్పడు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేరు. వారు లక్ష్మీపార్వతి, వాసిరెడ్డి పద్మ. ఈ ఇద్దరు నేతలు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బలమైన వాయిస్ ను వినిపించారు. ఇద్దరూ దాదాపు రోజూ మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీపై దుమ్మెత్తి పోసేవారు. జగన్ కు ఎన్నికల సమయంలో ఈ ఇద్దరూ బాగా ఉపయోగపడ్డారు.
జగన్ అధికారంలోకి రాగానే వాసిరెడ్డి పద్మకు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవి ఇచ్చారు. కేబినెట్ ర్యాంకు ఉన్న పదవి కావడంతో వాసిరెడ్డి పద్మ కూడా తొలుత ఖుషీ అయ్యారు. అయితే గత ఇరవై నెలల నుంచి వాసిరెడ్డి పద్మ వాయిస్ తక్కువగానే వినిపిస్తుంది. ఇందుకు కారణం తాను ముఖ్యమైన పోస్టులో ఉన్నానని చెప్పడం కారణం బయటకు చెప్పేదే. మహిళ సమస్యలపై ప్రత్యర్థి పార్టీ చేస్తున్న విమర్శలకు కూడా వాసిరెడ్డి పద్మ స్పందించడం లేదు.వాసిరెడ్డి పద్మ గతంలో పార్టీ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు. ఇక లక్ష్మీపార్వతి కూడా ఎన్నికలకు ముందు చంద్రబాబుపై మాటల తూటాలు పేల్చేవారు. సరే ఆమె చెప్పింది జనంలో ఎంతగా వెళ్లింది అన్న విషయం పక్కన పెడితే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. జగన్ అధికారంలోకి రాగానే లక్ష్మీపార్వతికి తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ పదవి ఇచ్చారు. కేబినెట్ ర్యాంకు పదవి కావడంతో లక్ష్మీ పార్వతి కూడా హ్యాపీగానే ఫీలయ్యారు.ఎందుకంటే ఇంతకు మించి ఈ ఇద్దరు మహిళ నేతలు పెద్ద పదవులు ఆశించే అవకాశం లేదు. జగన్ పదవులు ఇచ్చినా పార్టీని ప్రత్యర్థులు విమర్శించినప్పుడు తమ వాయిస్ ను వినిపించాలి. కానీ పదవులు అందుకున్న తర్వాత వీరిద్దరూ మౌనంగా ఉండటంపై పార్టీలో సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే ఏది మాట్లాడితే ఎలాంటి ఆదేశం సీఎంవో నుంచి వస్తుందోనన్న ఆందోళనతోనే వీరు మౌనంగా ఉండటమే ఉత్తమమనుకుంటున్నారన్నది కూడా వాస్తవం. మొత్తం మీద ఇద్దరు మహిళ నేతల వాయిస్ వినిపించకపోవ డం పార్టీకి మైనస్ అనే చెప్పాలి.

Related Posts