YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

జెనరిక్ మందులకు సర్కార్ ఊతం

జెనరిక్ మందులకు సర్కార్ ఊతం

ప్రజలను అడ్డగోలు దోపిడీకి గురి చేస్తున్న కొంత మంది వైద్యుల ఆగడాలకు అడ్డుకట్ట పడబోతోంది. ఇప్పటి వరకు మందుల పేరిట రోగులను దోచుకుంటున్న డాక్టర్లకు ముకుతాడు బిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  ప్రధాని నరేంద్ర మోడి స్వయంగా డాక్టర్ల వ్యవహార శైలిపై ఆక్షేపిస్తూ ఈ నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. ప్రధాని ఆదేశాలతో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియామందులు, డాక్టర్ల విధి విధానాలకు సంబంధించి నిర్ధిష్టమైన ఆదేశాలను వెలువరించింది. మరో వైపు బ్రాండ్‘ ముసుగులో జనరిక్ మందులను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మన దేశంలో అదే ఔషధాన్ని జెనెరిక్ పేరుతో కాకుండా దానికి కూడా బ్రాండ్ వేస్తున్నారు. డాక్టర్లు బ్రాండ్ పేరును కాకుండా జెనెరిక్ పేరునే ప్రిస్‌క్రైబ్ చేయవచ్చు. నిజానికి జెనరిక్ మందుల పట్ల డాక్టర్లకు కూడా పూర్తి అవగాహన లేదంటే అతిశయోక్తి కాదు. బ్రాండెడ్ అయినా, జెనెరిక్ ఔషధాలైనా కంపెనీకి అచ్చంగా మిగిలేది కేవలం 20 నుంచి 25 శాతం మాత్రమే. బ్రాండెడ్ విషయంలో మార్కెటింగ్ ఖర్చుంటే, జెనెరిక్ ఔషధాల విషయంలో డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులకే పోతుంది. పేదలకు కలిగే ప్రయోజనం మాత్రం శూన్యం. ఎందుకంటే సాధారణ మందుల దుకాణాల్లో జెనరిక్ ఔషధాలను కూడా ఎంఆర్‌పి ధరకే అమ్ముతున్నారు.ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న ప్రైవేటు వైద్యులు, ప్రైవేటు ఆసుపత్రులు అడ్డగోలుగా దోచుకుంటున్న ట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా మందుల పే రిట కొంత మంది వైద్యులు అనైతిక వ్యాపారాన్ని సాగిస్తున్నారు. కన్‌సల్టేషన్ ఫీజుతో నిమిత్తం లేకుండా మందులే లక్షంగా డాక్టర్లు తమ వృత్తి ధర్మాన్ని విస్మరించి దందా సాగిస్తున్నారు.జెనరిక్ మందులు అందుబాటులో ఉన్నప్పటికీ అవి కాకుండా అధిక ధరలతో కూడిన బ్రాండెడ్ మందులనే రోగులకు బలవంతంగా అంటగడుతున్నారు. రోగానికి సం బంధించిన మందులనే కాకుండా విటమిన్‌లు, బలవర్థకమైన మందుల పేరిట అవసరం లేని మందులను అంటగడుతున్నారు. ప్రి స్పిక్రిప్షన్‌పై మందులకు సంబంధించి డాక్టర్లు రాసిచ్చే మందుల పేర్లు మందుల దుకాణ యజమానికి తప్ప రోగికి, ఇతరులెవరికి అర్థం కాదు. ఒక్కో రోగికి మాములు వ్యాదుల కోసం అర డజను రకాల మందులను డాక్టర్లు రాసిస్తూ దోపిడి పర్వాన్ని సాగిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. \మాములు జ్వరాలకు సైతం వెయ్యి రూపాయలకు తగ్గకుండా మందులను రాసిస్తుండడం రివాజుగా మారింది. క్వాలిఫైడ్ డాక్టర్లే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న ఆర్‌ఎంపీలు సైతం అడ్డగోలుగా మందులను రాసిస్తూ పేద రోగులపై భారం మోపుతున్నారు. వైద్యులు కూడా మొత్తం రాసిచ్చిన మందులను తప్పనిసరిగా కొనుగోలు చేయాలంటూ హెచ్చరిస్తుండడంతో రోగులు తప్పనిసరిగా భారమై నప్పటికీ మందులను కొనుగోలు చేస్తున్నారు. కాగా ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని స్వయంగా స్పందించి హెచ్చరికలు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఐతే ఉమ్మడి జిల్లాలో జెనరిక్ మందుల దుకాణాలు అందుబాటులో లేకపోవడం తో రోగులు ఇబ్బందుల పాలయ్యే అవకాశాలున్నాయి. మొదట అన్ని మందుల దుకాణాల్లో జనరిక్ మందులను అందుబాటులో ఉంచి డాక్టర్లపై మరింత పర్యవేక్షణ చేపట్టాలని సూచిస్తున్నారు.

Related Posts