హైదరాబాద్ మార్చి 20, తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ తయారీకి ప్రాధాన్యత ఇస్తోంది. ఎలక్ట్రానిక్స్ తయారీలో తెలంగాణను విశ్వవ్యాప్తం చేయాలని ప్రయత్నం చేస్తోందని మంత్రి కేటీఆర్ వివరించారు. శనివారం అయన శాసనసభలో మాట్లాడారు. 912 ఎకరాల్లో రెండు ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్స్ ఉన్నాయి. పర్యావరణ వ్యవస్థను పరిరక్షించేందుకు ఎలక్ట్రానిక్స్ ను ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఎలక్ట్రానిక్స్ ప్రోత్సాహకాల కోసం స్టీరింగ్ కమిటీ నియామకం చేసింది. 70వేల కోట్ల పెట్టుబడుల టార్గెట్- 4లక్షల ఉద్యోగాల లక్ష్యంగా పెట్టుకున్నాం. టీఎస్ బీపాస్ ఫ్రీగా పర్మిషన్ ఇవ్వాలని సభ్యులు కోరుతున్నారు... ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని మంత్రి అన్నారు.