YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దొంగలమా, గుండాలమా

దొంగలమా, గుండాలమా

రాజన్న సిరిసిల్ల మార్చి 20, వేములవాడ ఎమ్మెల్యే ఎక్కడ.. జాడ చూపండి అని అడుగుతే మమ్ములను అరెస్టు చేస్తారా అని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు.  సంవత్సరం కాలం నుండి జర్మనీ దేశంలో విలాస వంతంగా ఉంటే వేములవాడ ప్రజలు అల్లాడుతున్నారు.  ఎమ్మెల్యే గురించి శాసనసభ కు వెల్లుతే మమ్ములను అరెస్ట్ చేయడం ప్రభుత్వ నిరంకుశ పాలన అని ఎద్దేవా చేశారు.  ప్రజల కోసం ఎమ్మెల్యే జాడ కోసం కాంగ్రెస్ వాలు అడుగుతే మా నాయకులను రాత్రి 3 గంటలకు అరెస్ట్ లు చేస్తారా.   మెమన్న టిఆర్ ఏఎస్ వాలలాగా దొంగలమా, గుండాలమా అని ప్రశ్నించారు.
వేములవాడ నియోజకవర్గ నికి ఏడాదిగా దూరంగా ఉన్న ఎమ్యెల్యే రమేష్ బాబు పై సీఎం కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు   సర్పంచ్ లు, కౌన్సిలర్లు పని చేయకపోతే సస్పెండ్ చేస్తున్నారు. ఎమ్యెల్యే పై చర్యలు ఉండవా?   జర్ననీ
నుండి రమేష్ బాబు ఇండియా కి వస్తే రెండు పాస్ పోర్ట్ లు ఉన్నాయని లూ కౌట్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తారని భయంతోనే రావడం లేదు. నెలకి లక్షల జీతం తీసుకుంటూ ప్రజలను సేవ చేయకుండా జర్మనీకి అంకితం అయిన ఎమ్యెల్యే రమేష్ బాబు
పై  శాసన సభలోనే చర్చించాలి.  ఈనెల 23 తేదీ లోపు ఇండియా కి రాకపోతే కాంగ్రెస్ పార్టీ తరుపున చలో అసెంబ్లీకి పిలుపునిస్తాం.  సిరిసిల్ల ఎగువ మానేరు ఎప్పుడో పూర్తి చేస్తా అన్నారు కేటిఆర్, కానీ నేటి వరకు అలాగే ఉందని అన్నారు.
అద్దరాత్రి కాంగ్రెస్ నేతలను సంసారాలు చేయకుండా రాత్రికి రాత్రే పోలీసులు అరెస్ట్ చేయడం శోచనీయం. 23 తేదీన ఎమ్మెల్యే రమేష్ బాబు ఇండియా కు రాకుంటే 24 తేదీన అసెంబ్లీనీ లోక్ సభ నియోజకవర్గ నుండి కాంగ్రెస్ నేతలం ముట్టడి చేస్తామని అయన అన్నారు.

Related Posts