విజయవాడ, మార్చి 20,
ఏపీ హైకోర్టులో ఎస్ఈసీనిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన పిటిషన్ దాఖలు చేశారు. తాను గవర్నర్‌తో జరుపుతున్న ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ బయటకు లీకవుతుండటంపై విచారణ జరిపాలని నిమ్మగడ్డ కోరారు. సీబీఐతో విచారణ జరిపించాలని.. తాను గవర్నర్‌కు రాస్తున్న ప్రివిలేజ్ లెటర్స్ అన్నీ ఆఫీస్ నుంచి ఎలా బయటకు వస్తున్నాయో తేల్చాలన్నారు. సెలవు పెడుతున్న విషక్షాలు కూడా బయటకు వస్తున్నాయని పిటిషన్‌లో ప్రస్తావించారు.. తాను గవర్నర్‌కు రాసిన లేఖల్ని సోషల్ మీడియాలో చూశామని మంత్రులు చెబుతున్నారని నిమ్మగడ్డ పిటిషన్‌లో ప్రస్తావించారు. అదేలా సాధ్యమో విచారణ జరపాలని కోరారు.. గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎస్ మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సలను ప్రతివాదులుగా చేర్చారు.