YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎమ్మెల్సీగా వాణీదేవి గెలుపు హైదరాబాద్

ఎమ్మెల్సీగా వాణీదేవి గెలుపు హైదరాబాద్

హైదరాబాద్ పట్టబద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్ధి వాణిదేవి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్ధి రామచంద్రరావు పైన ఆమె 11 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో  విజయం సాధించారు. దీనితో బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఫలితాలు వెలువడిన అనంతరం బీజేపీ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయారు. ఈ స్థానంలో చివరి వరకు ఫలితాలపై ఉత్కంఠ కొనసాగింది.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎలిమినేషన్ అయ్యారు.  ఆయన రెండో ప్రాధాన్యత ఓట్లు భారీగా టీఆర్ఎస్కు రావడంతో వాణిదేవి విజయం సులువయింది. ధించారు. మరోవైపు.. కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచీ ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చారు టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి.. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య ఉన్న ఓట్ల గ్యాప్.. ఓ సారి తగ్గుతూ.. మరోసారి పెరుగుతూ వచ్చి ఉత్కంఠతను పెంచింది.   వాణిదేవి గెలవడంతో  దీంతో హైదరాబాద్లోని టీఆర్ఎస్ భవన్లో సంబరాలు మొదలయ్యాయి. నాయకులు, కార్యకర్తలు టపాసులు కాల్చుతూ.. స్వీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శనివారం నాలుగో రోజు ఓట్ల లెక్కింపు కొనసాగింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానం ఓట్ల లెక్కింపును హైదరాబాద్లోని ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతుండగా, వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానం ఓట్ల లెక్కింపును నల్లగొండలోని ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో నిర్వహించారు.  

Related Posts