YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

పాలల్లో యూరియా కల్పిస్తున్నారు

 పాలల్లో  యూరియా కల్పిస్తున్నారు

కల్తీకి కాదేది అనర్హాం అన్న విధంగా వ్యవహారం సాగుతుంది. చిన్న పిల్లలు తాగే పాలను సైతం తమ వ్యాపారంకు అనుకూలం గా మలుచుకున్న కల్తీ మాఫియా  రెచ్చిపోతుంది. చారెడు చక్కెర.. దోసెడు యూరియా.. పావు లీటరు మంచి నూనె.. వీటన్నింటిని కలిపి ఓ అర లీటరు పాలు కూడా కలిపితే.. అమ్మకానికి పాలు సిద్ధం! ఇప్పుడు భాగ్యనగరంలో ఈ తరహా కల్తీ పాలే దర్శనమిస్తున్నాయి. నగర శివారును కేంద్రంగా చేసుకుని కొన్ని ముఠాలు ఈ అక్రమ దందాకు తెరలేపాయి. కల్తీ పాల వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా నడిపిస్తున్నాయి. స్వీట్‌ షాపులు, హోటళ్లకు, కొన్ని డైరీలకు కూడా కల్తీపాలను గుట్టుగా తరలిస్తున్నాయి.తూ తూ మంత్రం తనిఖీలతో అధికారులు చేతులు దులుపుకుంటుండటంతో నగరశివార్లతో పాటు పలు గ్రామాల్లో సైతం కల్తీ పాల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తుంది. ఎస్‌ఓటి టిమ్‌లు దాడులు చేసి అరెస్టు చేసిన నామమాత్రపు కేసులతో బయ టకు వచ్చిన వారు అడ్డాలు మారుస్తున్నారు తప్ప వ్యాపారాలు మాత్రం మారడం లేదన్న ప్రచారం జరుగుతుంది. పాల ఫౌడర్, యూరియా, నూనెతో పాటు మరో కెమికల్‌ను కలిపి మిక్స్ చేయడంతోపాటు మరో రెండు మార్గాల్లో పాలను తయారు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.యూరియా సాదారణంగా పంట పొలాలకు వేస్తారు. కానీ ఇక్కడ ఏకంగా పిల్లలు తాగేపాలల్లో వేస్తున్నారు. యూరియా కలిపిన పాలను తాగడం వల్ల పిల్లలతోపాటు పెద్దలు సైతం అనారోగ్యం పాలవడం ఖాయంగా మారింది.పాల వ్యాపారులతోపాలు పలువురు డైరీ నిర్వాహకులు అధిక పాల ఉత్పత్తి కోసం అడ్డదా రులు తొక్కుతున్నారు. గేదెల నుంచి అధికంగా పాలను ఉత్పత్తి చేయడానికి మద్యం తయారీ కంపెనీల నుంచి వ్యర్థాలను పశువుల దాణాలో కలిపి పెడుతూ పశువుల ఆరోగ్యంతో ఆడుకుం టున్నారు. మద్యం తయారీ వ్యర్ధ్దాలను తిన్న పశువులు సాధారణ పశువుల కన్నా రెండు నుంచి మూడు లీటర్ల పాలు ప్రతి రోజు అధికంగా ఇస్తుండటంతో నగర శివార్లలో పెద్దఎత్తున దీనిని కొనుగోలుచేసి మరీ పశువులకు పెడుతున్నారు.ప్రకాశం, చిత్తూర్‌తోపాటు పలు ఇతర జిల్లాల్లో ఉన్న మద్యం కంపెనీల నుంచి వ్యర్థాలను తీసుకువచ్చి నగర శివార్లో రైతులకు, డైరీ నిర్వాహ కులకు విక్రయిస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని శివార్లలో కల్తీ పాల తయారు కుటీర పరిశ్రమగా మారింది. శంషాబాద్‌తో పాటు మహేశ్వరం మండలం మంఖాల్‌లో సైతం నెలరోజుల క్రితం మరో మాఫియా బాగోతంను ఎస్‌ఓటి టిమ్ దాడులు చేసి పట్టుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకుని పెద్దఎత్తున ముడిసరుకును సీజ్‌చేసింది. కందుకూర్, ఇబ్రహీం పట్నం, హయత్‌నగర్, రాజేంద్రనగర్ మండలాల్లో సైతం కల్తీ మాఫియా పెద్ద ఎత్తున పాలను తయారుచేసి చిన్న చిన్న హోటల్‌తోపాటు ఇతరులకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. మేడ్చల్ జిల్లా పరిధిలోని కీసర, ఘట్‌కేసర్, శామీర్‌పేట్ మండలాల్లో మరింత రెచ్చిపోయి వ్యాపారం చేస్తున్నా రు. భువనగిరి, బొమ్మలరామారం తదితర ప్రాంతాలకు చెందిన పలువురు దందాలో కోట్లు ఆర్జిస్తున్నట్లు తెలిసి కొంతమంది స్థానికులు సైతం అడ్డదారులు వెతుకుతున్నారు. రెండు జిల్లాల పరిధిలో నెలకో బాగోతం బయటపడుతున్నప్పటికి కల్తీ పాల వ్యాపారం మాత్రం జోరుగానే సాగుతుంది. పోలీసు యంత్రాంగంతోపాటు ఇతర అధికారులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పశువులకు దానిని పెట్టి వాటిని జీవించే వయస్సు తగ్గించడంతోపాటు జనంను చంపుతున్నారు. అక్సిటోసిన్ ఇంజక్షన్‌లను పశువులకు ఇవ్వడంను ప్రభుత్వం పూర్తిగా నిషేదించిన జిల్లాలో తయారీ చేయడంతో పాటు పశువుల దాణా దుకాణాల్లో గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. పశువులకు అక్సిటోసిన్ ఇవ్వడం వల్ల పాలు ఎక్కువ రావడంతో పాటు పశువులతో పాటు పాలు తాగిన వారి ఆరోగ్యం సైతం పాడవుతుంది. జిల్లాలోని కొన్ని మూతపడిన కంపెనీలతో పాటు పలువురు ఇండ్లలో అక్సిటోసిన్ బాటిల్ తయారు చేయడంతో పాటు విక్రయాలు జరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని అధికారులు కల్తీపాల మాఫియాపై కఠినంగా వ్యవహరిం చవలసిన అవసరం చాలా వరకు ఉంది.

Related Posts