YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విస్తరణ తర్వాత ప్రాంతీయ మండళ్లు

విస్తరణ తర్వాత ప్రాంతీయ మండళ్లు

విజయవాడ, మార్చి 22, 
ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తుంది. వైసీపీలో ఇప్పటికీ పదవుల కోసం అనేక మంది వెయిట్ చేస్తున్నారు. మంత్రి పదవి అందరికీ దక్కే అవకాశాలు లేవు. కేబినెట్ ర్యాంకు ఉన్న పదవుల కోసం ఎమ్మెల్యేలు రెండేళ్లుగా వేచి చూస్తున్నారు. కీలకమైన నేతలకు కేబినెట్ ర్యాంకున్న పదవులను ఇచ్చేందుకు జగన్ తొలినాళ్లలో సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.అయితే ఇప్పటివరకూ ప్రాంతీయ అభివృద్ధి మండళ్ల ఏర్పాటు సాధ్యం కాలేదు. ఆ ఆలోచన కూడా జగన్ చేయడం లేదు. ఉత్తరాంధ్రలో విజయనగరం కేంద్రంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఒక ప్రాంతీయ అభివృద్ధి మండలి, కాకినాడ కేంద్రంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు కేంద్రంగా ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలు, కడప కేంద్రంగా చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలతో అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మూడేళ్లు మాత్రమే కాలవ్యవధిగా నిర్ణయించారు.ఒక్కొక్క అభివృద్ధి మండలికి ఒక ఛైర్మన్ ఉంటారు. మంత్రి పదవి దక్కే అవకాశం లేని వారికి ప్రాంతీయ మండలి ఛైర్మన్ గా అవకాశం ఇవ్వాలని అప్పట్లో జగన్ నిర్ణయించారు. కొన్ని సామాజిక సమీకరణాల కారణంగా తొలి విడత సీనియర్ నేతలకు కూడా మంత్రి పదవి దక్కలేదు. కోలగట్ల వీరభద్రస్వామి, కొలుసు పార్థసారధి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేళ్ల అప్పిిరెడ్డి తదితర పేర్లు విన్పించాయి. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాతనే ఈ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.అంటే జగన్ తన మంత్రి వర్గాన్ని మరో ఆరు నెలల్లో విస్తరించనున్నారు. అంతకు ముందే ఈ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మంత్రిపదవితో సమానమైన కేబినెట్ ర్యాంకు హోదా ఉన్న పదవి కావడంతో అనేకమంది వైసీపీ సీనియర్ నేతలు దీనిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ మంత్రి వర్గ విస్తరణలోపు వీరి ఆశలు నెరవేరే అవకాశాలు లేవు. ప్రస్తుతం జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలపైనే దృష్టి పెడుతుండటంతో ప్రాంతీయ అభివృద్ధి మండళ్లకు మరికొంత సమయం పట్టే అవకాశముంది.

Related Posts