YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం

ఓ కన్నేసి ఉంచాలి...

ఓ కన్నేసి ఉంచాలి...

‘టీనేజర్లలో ఎంతోమందిది సబితా లాంటి పరిస్థితే! తిట్టుకుంటూ, విసుక్కుంటూ, చిరాకు పడుతూ, పంటి బిగువున బాధను భరిస్తూ ఎలాగోలా ఆ మూడు గండాలను గట్టెక్కేసి ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు. అయితే నెలసరి తీరు, స్రావం, నొప్పులు...వీటి మీద అమ్మాయిలందరూ ఓ కన్నేసి ఉంచాలని స్త్రీల వైద్యులు డా. అనగాని మంజుల అంటున్నారు. ఆమె మాటల్లో చెప్పాలంటే...‘వాల్వ్‌ పాడైనా, అడ్డంకి ఏర్పడినా నీటి ధార క్రమం తప్పుతుంది. అలాంటప్పుడు మరమ్మత్తు చేసి సమస్యను సరిదిద్దుకోవాలి. నెలసరికీ ఈ సూత్రం వర్తిస్తుంది.

నెలసరి స్రావంలో హెచ్చుతగ్గులు, అవకతవకలు, అసహజ లక్షణాలు కనిపిస్తే వైద్యుల్ని కలిసి కారణాలు తెలుసుకోవటం అత్యవసరం’ అంటున్నారావిడ. నెలసరిలో జరిగే స్రావం గురించి మరింత లోతుగా వివరిస్తూ....సర్దుకోవటానికి సమయం పడుతుంది. 12, 13 ఏళ్ల కౌమార దశకొచ్చాక శరీరంలో హార్మోన్లు సర్దుకోవటానికి కనీసం మూడు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుంది. ఇది సహజం. ఇంతకాలంపాటు నెలసరిలో ఒడుదొడుకులు కనిపిస్తూనే ఉంటాయి. ప్రతి నెలా కాకుండా రెండు నెలలకోసారి నెలసరి రావటం, కొద్దిగా బ్లీడింగ్‌ కనిపించి ఆగిపోవటం సహజం. అయితే, ఇలాకాకుండా...వరుసగా రెండు, మూడు నెలలు రాకపోవటం, వస్తే విపరీతంగా రక్తస్రావం జరగటం, ఏకంగా 10 రోజులపాటు హెవీ బ్లీడింగ్‌ కొనసాగటం, లేదంటే...కొద్ది కొద్దిగా 10 నుంచి 20 రోజులపాటు బ్లీడింగ్‌ కనిపించటం లాంటి అసహజ లక్షణాలు కనిపిస్తే సమస్య ఉన్నట్టే! ఈ పరిస్థితే...‘అడాలసెంట్‌ ప్యుబర్టీ మెనొరేజియా’.

అధిక రక్తస్రావానికి కారణాలు అనేకం

రెండు నెలల తర్వాత వచ్చే నెలసరిలో అధిక రక్తస్రావం కనిపించటం సహజమే! ఇలాంటప్పుడు ‘లోపల పేరుకుని ఉండిపోయిన రక్తమంతా పోతుందిలే’! అనుకుని అశ్రద్ధ చేయకూడదు. అలాగే రక్తస్రావం అవుతూ ఉంటే రక్తలేమి ఏర్పడుతుంది. కాబట్టి వైద్యుల్ని కలిస్తే బ్లీడింగ్‌ ఆగే మందులు ఇస్తారు. ఒకవేళ అదే పరిస్థితి పునరావృతమవుతూ ఉంటే మాత్రం...

రక్తం గడ్డకట్టే తత్వం తక్కువగా ఉందా?., థైరాయిడ్‌ సమస్యలున్నాయా?.,విటమిన్ల లోపం ఉందా? అనే అంశాలను గమనించుకోవాలి.

ఇంకొందరికి గర్భాశయ ఇన్‌ఫెక్షన్లు ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడూ హెవీ బ్లీడింగ్‌ కనిపిస్తుంది. ఈ అంశాలన్నిటినీ తగిన పరీక్షలతో నిర్ధారించుకుని అసలు కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకుని నెలసరిని సరి చేసుకోవాలి.

అధిక బరువుతో తిప్పలే!
కౌమారానికి చేరుకోగానే కొంతమంది అమ్మాయిలు బరువు పెరగటం మొదలు పెడతారు. వ్యాయామం చేయకుండా ఎక్కువ సమయంపాటు కదలకుండా కూర్చోవటం, ఇంట్లోనే గడపటం వల్ల ‘పీసీవోడీ (పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ డిజార్డర్‌) తలెత్తుతుంది. దాని వల్ల కూడా హెవీ బ్లీడింగ్‌ కనిపించటం లేదా నెలసరి 3, 4 నెలలు రాకపోవటం, వచ్చినా స్పాటింగ్‌లా కనిపించి హఠాత్తుగా హెవీ బ్లీడింగ్‌ జరగటం లాంటివి జరుగుతాయి. ఇలాంటప్పుడు ఇతరత్రా పరీక్షలతోపాటు స్కానింగ్‌ చేస్తే అండాల్లో సిస్ట్‌లు ఉన్నాయా? ఇంకేదైనా సమస్య ఉందా అనేది తెలుస్తుంది. పీసీఓడీ నిర్ధారించుకుని చికిత్స తీసుకుంటే సమస్యలన్నీ సర్దుకుంటాయి. ఒకవేళ అంతా నార్మల్‌గా ఉంటే శరీర బరువును తగ్గించుకునే వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.

పీసీఓడీ నిర్లక్ష్యం చేస్తే?

అధిక రక్తస్రావానికి పీసీఓడీ కారణమై, ఆ సమస్యను నిర్లక్ష్యం చేస్తే అండాశయాల్లో సిస్ట్‌లు పెరగటం, హార్మోన్లలో హెచ్చుతగ్గులు జరగటం, టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ స్థాయులు పెరగటం లాంటివి జరుగుతాయి. ఫలితంగా నాలుగైదు నెలలపాటు పీరియడ్స్‌ రాకపోవటం, వస్తే ఆగకుండా రెండు, మూడు నెలలపాటు స్రావమవటం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇది ప్రమాదకరం. కాబట్టి నెలసరి 2 నెలలకు మించి రాలేదంటే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి.

అండాశయాల్లో కణుతులు

1 నుంచి 5 శాతం మంది అమ్మాయిల్లో ఒవేరియన్‌ ట్యూమర్లు ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు విపరీతమైన రక్తస్రావం, కడుపులో నొప్పితోపాటు గడ్డ ఉన్నట్టు అనిపించటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటప్పుడు స్కానింగ్‌తో లోపలున్న గడ్డ పరిమాణం తెలుసుకుని పీసీఓడీ సిస్ట్‌లా లేక కణుతులా అనేది కనిపెట్టి అందుకు తగిన చికిత్స తీసుకోవలసి ఉంటుంది. పీసీఓడీ సిస్ట్‌ అయితే మందులతో మూడు నెలల్లో కరిగిపోతాయి. నీటి బుడగల్లా కాకుండా కణుతుల్లా ఉంటే ఇతరత్రా ట్యూమర్‌ మార్కర్స్‌ అనే రక్త పరీక్షలు, ఎమ్మారై చేసి సమస్య ఉంటే చికిత్స తీసుకోవలసి ఉంటుంది.

నెలసరి నొప్పి తప్పదా?

నెలసరిలో గర్భాశయం సంకోచ వ్యాకోచాలకు గురవుతుంది. కాబట్టి కొద్దో గొప్పో నొప్పి ఉండటం సహజం. రొమ్ములు, నడుము, కాళ్లలో సలపరం, చిరాకు లాంటి లక్షణాలన్నీ హార్మోన్లలో హెచ్చుతగ్గుల వల్ల తలెత్తి నెలసరి ఒకరోజు గడవగానే సర్దుకుంటాయి. ఈ పరిస్థితి ‘ప్రీ మెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌’ (పి.ఎం.ఎస్‌). అయితే కొంతమందికి తట్టుకోలేనంత నొప్పి ఉంటుంది. అలాంటప్పుడు నొప్పి నెలసరి ముందు నుంచే ఉంటోందా? లేక నెలసరిలో మొదలవుతోందా? ముందు మొదలైన నొప్పి నెలసరి వచ్చాక తగ్గిపోతోందా? అనేది గమనించుకోవాలి. నెలసరితోపాటే నొప్పి కూడా మొదలైతే లోపలున్న రక్తాన్ని బయటకు నెట్టడం కోసం గర్భాశయం కుంచించుకుంటోందని అర్థం. 70 నుంచి 80 శాతం మంది నెలసరి నొప్పికి కారణం ఇదే అయి ఉంటుంది. ఇలాంటి నొప్పికి భయపడాల్సిన అవసరం లేదు. కొంతమందికి నెలసరికి ముందు నుంచే విపరీతమైన నొప్పి ఉండి నెలసరి రాగానే తగ్గిపోతుంది. ఇది గర్భాశయంలో దాగిన ఇన్‌ఫెక్షన్‌కు సూచన. పీరియడ్‌కి ముందు మొదలైన నొప్పి నెలసరి ఉన్నన్ని రోజులూ కొనసాగి, తర్వాత కూడా ఉంటూ ఉన్నా అసహజంగానే భావించాలి. ఈ పరిస్థితికి ఎండోమెట్రియోసిస్‌ కారణం.

చెడు రక్తం కానే కాదు!

నెలసరిలో పోతున్నది చెడు రక్తమనేది వట్టి అపోహ. ఇది రక్తనాళాల్లో ప్రవహించే మామూలు రక్తమేగానీ విసర్జించబడటానికి గర్భాశయంలోకి చేరుకున్న చెడు రక్తమేమీ కాదు. గర్భాశయం లోపలి పొర ఎండోమెట్రియం వదులై బయటకొచ్చే క్రమంలో ఈ రక్తస్రావం కనిపిస్తుంది. అదే నెలసరి. గర్భం దాల్చినప్పుడు ఇదే రక్తం పిండం ఎదుగుదలకు తోడ్పడుతుంది. కాబట్టి గర్భం దాలిస్తే నెలసరి ఆగిపోతుంది. కొంతమంది రక్తస్రావం ఎక్కువ జరుగుతూ ఉంటే చెడు రక్తమంతా బయటకెళ్లిపోవటం ఆరోగ్యానికి మంచిదేలే! అనే అపోహలో ఉంటూ ఉంటారు. ఇది కరెక్టు కాదు. రక్తస్రావంలో హెచ్చుతగ్గులను గమనించుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. రోజుకి 50 నుంచి 80 మి.లీటర్ల నెలసరి స్రావం సహజం. ఈ పరిమాణం మించితే అధిక రక్తస్రావంగా భావించాలి. ఈ పరిమాణాన్ని కొలవలేం కాబట్టి రోజుకి 6 అంతకంటే ఎక్కువ శానిటరీ న్యాప్కిన్లు అవసరం పడుతుంటే హెవీ బ్లీడింగ్‌ అని గ్రహించి వైద్యుల్ని కలవాలి.

సహజం..28 - 35 రోజుల వ్యవధిలో నెలసరి.,నెలసరి మొదటిరోజు మొదలైన నొప్పి రెండవ రోజుకి సర్దుకోవటం.,రొమ్ములు, పొత్తి కడుపు, నడుము నొప్పి., మొదటి, చివరి రోజుల్లో తక్కువగా, మధ్యలో స్రావం ఎక్కువగా ఉండటం.

ఆకలి మందగించటం , నోరు పొడిబారటం , ఒంట్లో నీరు చేరటం , ఒకటి, రెండు సార్లు రక్తం గడ్డలు పడటం , చిరాకు, విసుగు, కోపం ,తలనొప్పి , డిప్రెషన్‌ , రాత్రుళ్లు నిద్ర పట్టకపోవటం , అలసట , అసహజం , రెండు నెలలు దాటి నెలసరి రాకపోయినా , నెలసరి ముందు, తర్వాత కూడా నొప్పి ఉంటున్నా , హఠాత్తుగా స్రావం ఎక్కువైనా , రోజుకి 6 ప్యాడ్లు మార్చాల్సి వస్తున్నా , రక్తహీనతకు లోనైనా  పీసీఓడీ ఉండి సంవత్సరానికి కనీసం 9 సార్లు నెలసరి రాకపోయినా , స్రావంలో గడ్డలు విపరీతంగా పడుతున్నా  21, 26, 30, 35, 45... ఇన్ని రోజుల వ్యవధిలో నెలసరి రావటం సహజం. అయితే ఇదే క్రమం కొనసాగకపోయినా3 నుంచి 5 రోజులకు మించి రక్తస్రావం అవుతున్నా  నెలసరిలో నీరసం అనిపిస్తున్నా ,మెరుగైన జీవనశైలి , హార్మోన్లలో అవకతవకలు ఏర్పడకుండా, నెలసరి సక్రమంగా ఉండాలంటే టీనేజర్లు ఈ జాగ్రత్తలు పాటించాలి. ,బరువు పెరగకుండా చూసుకోవాలి. , జంక్‌ ఫుడ్‌కు బదులు ఇంటి భోజనం తినాలి. , పీచు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి.,రోజుకి కనీసం గంట, గంటన్నరపాటైనా వ్యాయామం లేదా యోగా చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లు ఏర్పరుచుకోవాలి. నూనెలు తగ్గించి ఉడకబెట్టినవి తినాలి. తాజా కూరగాయలు, పళ్లు తినాలి. పరీక్షలు, చదువు ఒత్తిడులను తగ్గించుకోవటానికి యోగా లేదా మెడిటేషన్‌ చేయాలి. పొత్తికడుపు దగ్గర కొవ్వు పెరగకుండా చూసుకోవాలి.

                                                        

                                                                                        - పద్మశ్రీ డా. అనగాని మంజుల, ఘైనకాలజిస్ట్, హైదరాబాద్

 

 

 

Related Posts