YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

జూపల్లి టీం ఎత్తులు

జూపల్లి టీం ఎత్తులు

మహబూబ్ నగర్, మార్చి 22, ఆ నియోజ‌క‌వ‌ర్గంలో అధికార పార్టీ.. వ‌ర్గ పోరుకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ప్రభుత్వ కార్యక్రమం అయినా, పార్టీ ప్రోగ్రాం అయినా రచ్చకెక్కాల్సిందే. ఒకరిది పట్టు పెంచుకునే ప్రయత్నం. మరొకరిది పట్టు సడలకుండా జాగ్రత్త పడే ప్రయత్నం. ఇప్పుడా నియోజకవర్గంలో కారు స్టీరింగ్‌ పోరు హాట్ టాపిక్ గా మారుతోంది. నాగర్ కర్నూల్  జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గంలో గులాబీ పార్టి నేతల మద్య వర్గ పోరు జోరుగా సాగుతోంది. సందర్భం ఏదైనా, ఎన్నికలేవైనా నేతల మధ్య వర్గ పోరు హైలైట్‌ అవుతోంది. గత ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ది, మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన బీరం హర్ష వర్దన్ రెడ్డి గెలుపొందారు. ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాలతో  ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గులాబీ కండువా కప్పేసుకున్నారు. అప్పటి నుంచి కొల్లాపూర్ లో టిఆర్ఎస్ పార్టి జూపల్లి , హర్ష వర్గాలుగా చీలింది.హర్షవర్దన్ రెడ్డి  టిఆర్ఎస్ లో చేరడంతో రాజుకున్న వర్గపోరును చల్లార్చడం పై అటు అధిష్టానం పెద్దలు కూడా పెద్దగాదృష్టి సారించలేదు. దీంతో జూపల్లి, హర్షవర్దన్ వర్గాల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోన్న పరిస్థితి ఏర్పడింది. కొల్లాపూర్ లో జరిగే అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో స్వపక్షంలో విపక్ష పాత్రను ఓ వర్గం పోషిస్తుండటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోందట. కొల్లాపూర్ లో అధికార పార్టీ కార్యక్రమం అంటే ఇప్పుడు పార్టీ కార్యకర్తలు టెన్షన్‌ పడే పరిస్థితి ఏర్పడిందటే, నేతల మధ్య ఏ స్థాయిలో విభేదాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ వర్గ పోరు కాస్తా క్షేత్ర స్థాయి వరకు పాకి క్యాడర్ కూడా రెండుగా చీలిపోయిన పరిస్థితి కొల్లాపూర్ నియోజక వర్గంలో కనిపిస్తోంది.  మరోపక్క ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ  కార్యక్రమాల్లోనూ,  అధికారిక కార్యక్రమాల్లోనూ పూర్తిగా తన మార్కు ఉండేలా జాగ్రత్త పడుతున్నారు . ప్రతి నిర్ణయం, ప్రతి కార్యక్రమం  తన కనుసన్నల్లోనే కొనసాగే విధంగా చర్యలు తీసుకుంటూ ఉండడం.. జూపల్లి వర్గానికి మింగుడుపడటం అంశంగా మారిందటస్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు , ఇతర కార్యక్రమాల వేదికగా వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టి సభ్యత్వ నమోదు, ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో మరో మారు బహిర్గతం అయ్యాయి. టియ్యారెస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సభ్యత్వ నమోదు ప్రక్రియకు జూపల్లి అండ్ టీంను పూర్తిగా దూరం పెట్టేలా ఎమ్మెల్యే హర్ష వర్దన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని జూపల్లి వర్గం అంటోంది. జూపల్లి కృష్ణారావుతో పాటు అతని వర్గీయులుగా పేరున్న వారికి  సభ్యత్వ నమోదు పుస్తకాలను ఇవ్వకపోవడంపై జూపల్లి  వర్గం గుర్రుగా ఉందట. తమ నేతను అవమానించేలా వ్యవహరిస్తున్నారని జూపల్లి వర్గం మండిపడుతోంది. మరో పక్క మంత్రులు, ఎమ్మెల్సీ అభ్యర్థి హజరైన ఎన్నికల సన్నాహక సమావేశానికి డుమ్మా కొట్టిన జూపల్లి, మరుసటి రోజు తన వర్గీయులతో  సమావేశం నిర్వహించి అయామ్ విత్ టిఆర్ఎస్ అనే మెసేజ్ ఇచ్చారు. అయితే పలు సందర్భాల్లో జూపల్లి, ఎమ్మెల్యే హర్షవర్దన్  ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ నియోజక వర్గంలో తన పట్టు సడలకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. క్యాడర్ ను కాపాడుకుంటూ పార్టీలో ఉనికి సడలకుండా ముందుకుపోతున్నారనే టాక్‌ వస్తోంది.  మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేతగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం,  ఉన్న నేతగా ప్రజల్లో గుర్తింపు ఉండడంవల్ల పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని భావించి , జూపల్లి తనకు తానుగా పార్టీ నుంచి వెళ్లి పోయేలా కుట్రలు జరుగుతున్నాయని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో ఓ మంత్రి పాత్ర ఉందంటోంది జూపల్లి టీం . వచ్చే ఎన్నికల్లో టికెట్ విషయంలో జూపల్లి నుంచే సమస్య ఉంటుందని భావించిన  ఎమ్మెల్యే బీరం,  ఏదో విదంగా జూపల్లిని పార్టీ వీడేలా చేస్తున్నారనే అభిప్రాయాలు పార్టీలో వినిపిస్తున్నాయట.  ఈ పరిస్థితుల్లో కొల్లాపూర్ గులాబీ పార్టీ గందరగోళం విషయంలో అధిష్టానం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది.  

Related Posts