హైదరాబాద్, మార్చి 22, మెట్రోరైల్ సంస్థ అదనపు ఆదాయం పొందేందుకు భూములను వెంచర్లుగా డెవలప్చేయాలనే ప్లాన్ ఆచరణకు నోచుకోవట్లేదు. వెంచర్లు ఎప్పుడూ మొదలుపెట్టాలనే దానిపై సస్పెన్స్నెలకొంది. సిటీలో భూములకు ఉన్న డిమాండ్ బట్టి ఇప్పటికే హెచ్ఎండీఏ ఉప్పల్ భగాయత్ భూములను డెవలప్ చేసి అమ్ముకుంది. అదే బాటలో మెట్రో సంస్థ కూడా వెంచర్లకు ప్లాన్ చేసింది. ఏడాదిన్నర క్రితమే ప్లాన్ రెడీ చేసుకున్నా, కరోనాతో పెండింగ్లో పడింది. ప్రస్తుతం అన్నీ మామూలుగా మారాయి. దీంతో మళ్లీ వెంచర్పనులు మొదలుపెట్టాలని మెట్రో అధికారులు ఆలోచిస్తున్నారు. అయితే ప్లాట్లకు ఉండే డిమాండ్ పైన క్లారిటీ మాత్రం రావట్లేదని తెలిసింది. దీంతో వెంచర్ల డెవలప్కు రిపోర్ట్రెడీ చేసినా, యాక్షన్ ప్లాన్ అమలు చేయడం లేదు.అన్లాక్తర్వాత సిటీలో రియల్ బిజినెస్పుంజుకుంది. అయితే ఆర్థిక సంక్షోభం పూర్తిగా తొలగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వెంచర్లు చేస్తే డిమాండ్ ఉంటుందో లేదోననే డైలమా మెట్రోవర్గాల్లో నెలకొంది. భగాయత్ భూములకు వచ్చినంత డిమాండ్, ఆదాయం రాకపోతే నిర్వహణ, అభివృద్ధి ఖర్చులన్నీ మెట్రో సంస్థపైనే పడతాయి. మిగతా భూములపైనా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడిదే మెట్రో వర్గాలను ఆలోచనలో పడేసిందని సమాచారం. నిర్వహణ భారం, పెట్టుబడి, రిటర్న్స్, ప్లాట్ల అమ్మకాలపై అధికారులకు క్లారిటీ వస్తే గానీ ముందుకెళ్లేలా లేరు. దీంతోనే మెట్రో వెంచర్ లాంచింగ్లేట్అవుతుందని టాక్.మెట్రో సంస్థ వెంచర్ పనులను 3 నెలల్లో కంప్లీట్చేయనుంది. రోడ్లు, కమర్షియల్ స్పేస్ నిర్మాణానికి అనుకూలంగా, చిన్న ప్లాట్లుగా చేసేందుకు ప్రతిపాదించింది. ఉప్పల్ భగాయత్ తరహాలోనే అదనపు ఫెసిలిటీస్కల్పించి వేలానికి రెడీ చేయనుంది. త్వరగా డెవలప్ మెంట్ పనులు పూర్తి చేసి, వేలంలో అమ్మకానికి పెట్టనుంది.ఉప్పల్, నాగోల్, మియాపూర్ డిపోల వద్ద మెట్రో రైల్సంస్థకు వందల ఎకరాల్లో భూములు ఉన్నాయి. ఇందులో ఉప్పల్ వద్ద ప్రభుత్వం కేటాయించిన మొత్తం 142 ఎకరాల్లోని 100 ఎకరాల్లో మెట్రో డిపో, పార్కింగ్ యార్డులు, ట్రాఫిక్ నిర్వహణకు పోయింది. మిగిలిన 42 ఎకరాల భూమి ఖాళీగానే ఉంది. ఇందులో ముందు గా15 ఎకరాల్లో వెంచర్ నిర్మించి, రూ. 700 కోట్ల ఆదాయం లక్ష్యంగా ప్లాన్ చేసింది. అయితే కరోనా కారణంగా పెండింగ్పడింది.