YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

భారీగా మామిడి దిగుమతులు

భారీగా మామిడి దిగుమతులు

తెలుగు రాష్ట్రాల నుంచి మామిడి ఎగుమతులు గణనీయంగా తగ్గనున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఏటా సగటున మూడు నుంచి మూడున్నర లక్షల టన్నుల మామిడి దిగుబడి ఉంటుంది. ఈ ఏడాది పూత దశలో ఎండల దెబ్బకి దిగుబడులు 50 నుంచి 70 శాతం పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే చెట్టుకు పది పదిహేను కాయలు కూడా కనిపించడం లేదు. ఈ ప్రభావం ఎగుమతులపైనా కనిపిస్తోంది. గడ్డిఅన్నారం మార్కెట్‌కు అత్య ధికంగా 1250 టన్నుల మామిడి చేరింది. ఈ మధ్య కాలంలో సుమారు 600 టన్నుల లోపే మామిడి కాయలు మార్కెట్‌యార్డుకు చేరాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలలోని వివిధ ప్రాంతాల నుంచి మామిడికాయలు పెద్ద ఎత్తున యార్డు కు చేరడంతో మార్కెట్ యార్డులో రద్దీ వాతవరణం ఏర్పడింది. దీంతో మార్కెటింగ్ శాఖ అధికారులు, పాలకవర్గం ప్రతినిధులు యార్డులో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మామిడి సరుకు వెల్లువెత్తడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత రెండు మూడు రోజుల వరకు బెనిషాన్ రకం టన్ను గరిష్ట ధర రూ. 60 వేలు నుండి 80 వేలు పలుకగా టన్ను గరిష్ట ధర రూ. 45 వేలు మాత్రమే పలికింది. కనిష్టం రూ. 20 వేలు పలి కింది. దీంతో ఒక్కసారిగా గరిష్ట ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. సుమారు పది నుంచి 15 వేల వరకు ధరల్లో తేడాలు వచ్చాయి. తోతాపరి రకం మామిడికి అత్యధికంగా రూ. 20 వేలు పలుకగా, కనిష్టంగా రూ. 10 వేలు పలికింది.ఏటా రెండు రాష్ట్రాల నుంచి దాదాపు 1,000 టన్నుల మామిడి పండ్లు విదేశాలకు ఎగుమతి అయ్యేవి. ఈ సంవత్సరం ఎగుమతులు 500-600 టన్నులు మించక పోవచ్చని అంచనా. ప్రస్తుతం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఎఇ), సింగపూర్‌, హాంకాంగ్‌, మలేషియా దేశాలకు మాత్రమే హైదరాబాద్‌, చెన్నై విమానాశ్రయాల నుంచి కొద్ది స్థాయిలో మామిడి పండ్లు ఎగుమతి అవు తున్నాయి. ఇటీవల యుఎఇకి ఎగుమతి చేసిన మామిడి పండ్లలో పురుగు మందుల అవశేషాలు మోతాదుకు మించి కనిపించా యి. దీంతో ఆ దేశం దిగుమతి నిబంధనలు మరింత కఠినం చేసింది. ఈ సంవత్సరం దిగుబడులు తగ్గడంతో పాటు, నాణ్యత పెద్ద సమస్యగా మారిందని హైదరాబాద్‌లోని అపెడా అధికారులు చెప్పారు. దిగుబడి గణనీయంగా తగ్గడంతో సీజన్‌ ప్రారంభంలోనే బంగినపల్లితో సహా అన్ని రకాల మామిడి ధర చుక్కలంటింది. ఏటా సీజన్‌ ప్రారంభంలో టన్ను బంగినపల్లి రకం మామిడి ధర రూ.25,000 నుంచి రూ.30,000 ఉండేది. సీజన్‌ చివర్లో టన్ను రూ.50,000 నుంచి రూ.60,000 పలికేది. ఈ సంవత్సరం సీజన్‌ ప్రారంభంలోనే టన్ను రూ.50,000 పలికింది. ప్రస్తుతం రూ.45,000 నుంచి రూ.50,000 పలుకుతోంది. సీజన్‌ చివర్లో ఎగుమతి మార్కెట్‌కు అనువైన బంగినపల్లి, అల్ఫోన్సా మామిడి ధర మరింత పెరగుతుందని భావిస్తున్నారు. రైతుల నుంచి ఈ ధరకు మామిడి సేకరించి, వాటిని శుభ్రం చేసి ఎగుమతి చేసేందుకు ఎగుమతిదారులు మరింత ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇందుకు ఎంత లేదన్నా కిలోకు రూ.70 నుంచి రూ.120 వరకు ఖర్చవుతోంది. 

Related Posts