వైద్య బిల్లు లు రావడంలేదు
కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
హైదరాబాద్ మార్చ్ 22
రాష్ట్రంలో ఉద్యోగులకు రియంబర్స్మెంట్ బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. 2 వందల కోట్ల బకాయిలు ప్రభుత్వం చెల్లించడం లేదు. ఎమర్జెన్సీ చికిత్స ఉద్యోగులకు వర్తించడం లేదు. హెల్త్ కార్డ్ లతో ట్రీట్మెంట్ చేయించుకునే ఉద్యోగులను చులకనగా చూస్తారు. ఆరోగ్య శ్రీ- ఉద్యోగులను ఒకే తాటి పైకి తెచ్చారని అన్నారు.
మంత్రి ఈటెల రాజేందర్ సమాధానమిస్తూ ఉద్యోగులకు మంచి చికిత్స అందించేందుకు ఈహెచ్ఎస్ ప్రవేశపెట్టింది. ప్రైవేట్ హాస్పిటల్స్ లలో చిన్న చూపు చూసే అంశం మా దృష్టికి వచ్చింది. ఈహెచ్ఎస్ స్కీమ్ కింద 37 కోట్లు మాత్రమే బకాయిలు ఉన్నాయి. మెరుగైన వైద్యం అందించేందుకు మరింత కృషి చేస్తామని అన్నారు.