స్కౌట్ విద్యార్థిని నందినికి కరోనా ప్రశంసపత్రం
ఎమ్మిగనూరు మార్చ్ 22
పట్టణంలో మాచాని బాలికల ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న భారతీయ స్కౌట్ అండ్ గైడ్ విద్యార్థిని బోడబండ ఎ.నందిని కరోనా-లాక్ డౌన్ సమయంలో విశేష సేవలందించినందుకు గాను పోలీస్ శాఖ ప్రసంసపత్రం అందించింది. 2020 సంవత్సరంలో కరోనా ఉగ్రరూపం దాల్చినసమయంలో లాక్ డౌన్ విధించడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడిన సంగతి తెల్సిందే. ఆ సమయంలో బోడబండకు చెందిన ఎ.నందిని పేద కుటుంబాలకు అవసరమైన నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించింది. శానిటైజర్లతో పాటు స్వయంగా మాస్కూలు కుట్టి బోడబండ గ్రామంతో పాటు సమీప గ్రామాల్లో ప్రజలకు పంపిణీ చేసింది. మూగజీవాలైన కోతులకు పండ్లు అందించింది. మొక్కలకు నీరు పోసి సంరక్షింది. సేవలను గుర్తించిన పోలీస్ శాఖ ప్రశంసపత్రం పంపింది. సోమవారం ఆదోని డీఎప్పీ కార్యాలయంలో డీఎస్పీ వినోద్ కుమార్ విద్యార్థిని నందినికి ప్రశంసపత్రం అందించి అభినందించారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ చిన్నవయస్సులోనే సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థిని నందిని మాట్లాడుతూ ఇదే స్పూర్తితో స్కౌట్ ఆద్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఈసందర్భంగా విద్యార్థిని నందినిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గౌసియా బేగం, స్కౌట్ అండ్ గైడ్ ఇంచార్జీ లియో ఆంటోని, కెప్టెన్లు సృజన, నాగేశ్వరి, గ్రామస్థులు అభినందించారు.