ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలలలో విజృంభిస్తున్న కరోనా వ్యాధి
ఆందోళనలో విద్యార్థులు తల్లిదండ్రులు
కర్నూల్ మార్చ్ 22
ఫిబ్రవరి నెల 2021 సంవత్సరం నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు తరగతులను రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది.అయితే ఈ 25 రోజులలో రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వ పాఠశాలలో కరోనా వ్యాధి విద్యార్థినీ విద్యార్థులలోనూ, ఉపాధ్యాయుల లోనూ తీవ్రంగా ప్రబలుతోంది. దీనికి ఉదాహరణ ప్రభుత్వం ఇప్పటివరకు ఉపాధ్యాయులకు 70% మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 15% కరోనా వ్యాధి సోకింది, అదేవిధంగా విద్యార్థులకు 75% కరోనా పరీక్షలు నిర్వహించగా 12% విద్యార్థులకు వ్యాధి సోకింది,ఇక్కడితో కాకుండా పాఠశాలలో పని చేస్తున్న మధ్యాహ్నం భోజనం పధకం నిర్వాహకులకు ఈ వ్యాధి చాపకింద నీరులా పాకుతోంది.దీంతో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు,ఉపాధ్యాయులకు ప్రాణం భయం పట్టుకుంది.ఎందువలన అంటే ఇప్పటివరకు ఈ వ్యాధి బారిన పడిన వారు కొంత మంది మరణించారు,ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అయినా ఒడిషా,కర్ణాటక, తమిళనాడు,చత్తీస్ ఘడ్ ,మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ,తెలంగాణ,ఢిల్లీ మరికొన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఆ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఈ విధ్యా సంవత్సరాన్ని 0 సంవత్సరంగా గుర్తించారు.1 నుంచి 10వ తరగతి వరకు ఈ రాష్ట్రాల్లో విద్యార్థులకు పూర్తిగా పాఠాలను ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు.ఈ విధంగా మన రాష్ట్రంలో కూడా తక్షణమే పాఠశాలను మూసివేసి 1 తరగతి 10 తరగతి వరకు విద్యార్థినీ విద్యార్థులకు ఆన్ లైన్ చరవాణి ద్వారా పాఠాలను విద్యార్థులకు బోధించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు,ఉపాధ్యాయ సంఘాలు,విద్యార్థి సంఘాలు,మేధావులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కు,విద్యాశాఖ మంత్రి ఆది మూలపు సురేష్ కు,రాష్ట్ర విద్యా శాఖ అధికారులకు ముక్త కంఠంతో కోరుతున్నారు. మన రాష్ట్రంలో చదివే విద్యార్థులు యొక్క ఆరోగ్యంను దృష్టిలో పెట్టుకొని పూర్తిస్థాయిలో పాఠశాలలకు తక్షణమే సెలవులు ప్రకటించి విద్యార్థులు యొక్క జీవితాలు రక్షించవలసిందిగా కోరుతున్నారు.