అక్రమ మైనింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జ్యోతుల నెహ్రూ
జగ్గంపేట మార్చ్ 22
జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో సర్వే నెంబర్: 109, 107 రెవెన్యూ పోరంబోకు లో అక్రమ మైనింగ్ చేస్తున్నారని స్థానిక రైతులు వెళ్లి ఆందోళన చేశారు . ఈరోజు విషయం తెలుసుకున్న జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్థానిక నాయకులు రైతులతో కలిసి అక్రమ మైనింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరం ఆరు నెలల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా కంచర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి చైనా క్లే అక్రమ మైనింగ్ తవ్వుకుంటూ పోతున్నారు సుమారు పది కోట్ల రూపాయలు విలువచేసే చైనా క్లే తరలించుకుపోయారు. పురుషోత్తపట్నం ఫీజ్ టు పైప్ లైన్ పై భారీ వాహనాలతో చైనా క్లే తరలించుకుపోతున్నారు చుట్టుపక్కల ప్రాంత రైతులు అందరూ కూడా అనేక ఇబ్బందులు పాలవుతున్నారు. ఈ విషయంపై ఆర్డీవోను వివరణ కోరగా దీనిపై కేసు నమోదు చేశామన్నారు. జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వివరణ మా పరిధిలోకి రాలేదని చెప్పారన్నారు. ఎమ్మార్వో వివరణ కోరగా అక్కడ ఏ విధమైన వాహనాలు మాకు కనబడలేదు అని అన్నారు . అక్రమ మైనింగ్ పై పాల్పడుతున్న వ్యక్తులు వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ ఆస్తులను దోసుకున్న వారిపై ఫైన్ వేసి వాహనాలు సీజ్ చేయాలని లేనిపక్షంలో న్యాయపోరాటని సిద్ధమని జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎస్ వి ఎస్ అప్పలరాజు , మండల టిడిపి అధ్యక్షులు మారిశెట్టి భద్రం, కొత్త కొండ బాబు, స్థానిక రైతు అడబాల వెంకటేశ్వరరావు, సాంబత్తుల చంద్రశేఖర్, స్థానిక రైతులు టిడిపి నాయకులు పాల్గొన్నారు.