YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

సింధియా...రాంగ్ డెసిషనా

సింధియా...రాంగ్ డెసిషనా

సింధియా...రాంగ్ డెసిషనా
భోపాల్, మార్చి 23, 
రాహుల్ అన్నది వాస్తవమే. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ లోనే కొనసాగినట్లయితే త్వరగా ముఖ్యమంత్రి అయ్యేవారు. ఇప్పడు బీజేపీలో చేరి జ్యోతిరాదిత్య సింధియా తప్పు చేసినట్లే కనపడుతుంది. కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని భావించి జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీ పరిస్థితి దేశ వ్యాప్తంగా బాగాలేదు. భవిష్యత్ లో బీజేపీలో పదవులు దక్కుతాయన్న నమ్మకం లేదు. ప్రధానంగా ముఖ్యమంత్రి పదవి లభిస్తుందన్న ఆశ అంతకంటే లేదు.జ్యోతిరాదిత్య సింధియా రాంగ్ టైమ్ లో బీజేపీలోకి వెళ్లారు. మధ్యప్రదేశ్ లో మరోసారి బీజేపీ గెలిచినా సింధియాకు సీఎం అవకాశం రాదు. ఇప్పటికి బీజేపీ రాజ్యసభ పదవి ఇచ్చినప్పటికీ దానితోనే ఆయన సంతృప్తి పడాల్సిన అవసరం ఉంటుంది. అంతకు మించి పెద్ద ఆశలు పెట్టుకోకపోవడమే మంచిది. వచ్చే ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో బీజేపీ గెలిచినా సింధియాకు మాత్రం అవకాశం రాదని ఇప్పటికే స్పష్టమయింది.కాంగ్రెస్ లో జ్యోతిరాదిత్య సింధియా ఉండి ఉంటే త్వరగా ముఖ్యమంత్రి అయ్యే వారు. మధ్యప్రదేశ్ లో కమల్ నాధ్, దిగ్విజయ్ సింగ్ ల శకం ముగిసింది. ఇప్పుడిప్పుడే రాహుల్ గాంధీ పార్టీ ని తన చేతుల్లోకి తీసుకుంటున్నారు. సీనియర్ నేతలందరూ దాదాపు పక్కకు వెళ్లిపోయినట్లే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లోనే జ్యోతిరాదిత్య సింధియా ఉండి ఉంటే రాహుల్ తో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు రాజకీయ భవిష్యత్ కల్పించి ఉండేది.మొన్నటి వరకూ సోనియా గాంధీ చెప్పినట్లు జరిగేది. ఇప్పుడు ఆమె అనారోగ్య కారణాలతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రాహుల్, ప్రియాంకల ఆధిపత్యం పార్టీలో స్పష్టంగా కన్పిస్తుంది. ఈ సమయంలో జ్యోతిరాదిత్య సింధియా వెళ్లిపోవడం ఆయనకు వ్యక్తిగతంగా దెబ్బ అని చెప్పక తప్పదు. ఆయన తిరిగి పార్టీలోకి వస్తానన్నా రాహుల్ అంగీకరించే అవకాశముంది. బీజేపీలోనే జ్యోతిరాదిత్య సింధియా కొనసాగితే మాత్రం ఆయన ఎప్పటికీ సీఎం కాలేరన్న రాహ‍ుల్ మాటలు వాస్తవం.

Related Posts