YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రాజస్థాన్ లో మళ్లీ కదలికలు

రాజస్థాన్ లో మళ్లీ కదలికలు

రాజస్థాన్ లో మళ్లీ కదలికలు
జైపూర్, మార్చి 23, 
రాజస్థాన్ లో బీజేపీ లో వర్గ పోరు రోజురోజుకూ ముదిరిపోతుంది. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, పీసీసీ అధ్యక్షుడు సతీష్ పునీయా వర్గాలుగా విడిపోయాయి. వసుంధర రాజే వర్గాన్ని పూర్తి అణిచివేసే ప్రయత్నంలో సతీష్ పునీయా ఉన్నారు. నిజానికి రాజస్థాన్ బీజేపీకి వసుంధర రాజే పెద్దదిక్కు. కొన్ని దశాబ్దాలుగా ఆమె పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. రాజస్థాన్ లో బీజేపీ అధికారంలోకి వస్తే వసుంధర రాజే ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని మొన్నటి వరకూ అనుకున్నారు.కానీ సతీష్ పునీయా బీజేపీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత వసుంధర రాజేను క్రమంగా దూరం పెడుతూ వస్తున్నారు. జిల్లా స్థాయి కమిటీల నుంచి రాష్ట్ర స్థాయి కమిటీల్లో వసుంధ రాజే వర్గానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అయితే ఈ వర్గ పోరు ప్రభావం త్వరలో జరగనున్న నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలపై ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే రాజస్థాన్ లో రోజురోజుకు వర్గ పోరు పెరిగిపోతుండటంతో జాతీయ స్థాయి నాయకత్వం కూడా ఆందోళన చెందుతోంది.సతీష్ పునియా వెనక అమిత్ షా ఉన్నారు. తొలి నుంచి వసుంధరాజే ను అమిత్ షా వ్యతిరేకిస్తున్నారు. గత ఎన్నికలకు ముందే ఆమెకు ప్రాధాన్యత తగ్గించాలని అమిత్ షా ప్రయత్నించారు. కానీ అప్పట్లో ఆమె ముఖ్యమంత్రిగా ఉండటం, అప్పట్లో సిట్టింగ్ శాసనసభ్యుల మద్దతు ఎక్కువగా వసుంధర రాజేకు ఉండటంతో అప్పుడు ఆమె వర్గానికి ప్రాధాన్యత తగ్గించే విషయంలో వెనకడుగు వేశారు.ఓటమి తర్వాత సతీష్ పునీయాకు వెనక ఉండి అమిత్ షా మద్దతు తెలుపుతున్నారు. దీంతో వసుంధ రాజే ఢిల్లీ వెళ్లి పెద్దలను అందరినీ కలసి వచ్చినా ప్రయోజనం లేకపోయింది. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ప్రకటించాలన్నది వసుంధరరాజే ప్రధాన డిమాండ్ గా ఉంది. కానీ అధినాయకత్వం మాత్రం అందుకు ఇష్టపడటం లేదు. సతీష్ పునీయా ద్వారా కథ నడుపుతుంది. మొత్తం మీద రాజస్థాన్ లో నెలకొన్న విభేదాలు రానున్న రోజుల్లో బీజేపీ అధినాయకత్వానికి మరింత తలనొప్పిగా మారనుంది.

Related Posts