YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

జౌళీ భేటీకి హజరయిన మంత్రి కేటీఆర్

జౌళీ భేటీకి హజరయిన మంత్రి కేటీఆర్

కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ నేతృత్వంలో అన్ని రాష్ట్రాల జౌళి శాఖల మంత్రుల సమావేశం గురువారం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేనేత, హస్త కళల రంగానికి ఊతమిచ్చేందుకు ఈ మంత్రుల సమావేశం నిర్వహించారు. తెలంగాణ నుంచి సమావేశంలో మంత్రి కేటీఆర్, జౌళి శాఖ డైరెక్టర్ శైలజ రామాయర్, అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి పాల్గోన్నారు. చేనేత రంగ అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు పోయెందుకు ఈ కార్యక్రమం నిర్వహించింది. సమావేశ వివరాలను మంత్రి కేటీఆర్ మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో చేనేత పరిశ్రమ కోసం తెలంగాణా జరుగు మంచి కార్యక్రమాలని సమావేశంలో వివరించాను. చేనెత కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా  1270 కోట్ల రూపాయలను కేటాయించింది బడ్జెట్ లో. చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా  రెండు  కార్పోరేషన్ లు ఎర్పాటు చేశామని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విదంగా నూలుకు , అద్దకాలకు సబ్సిడీ ఇస్తూన్నాం. చేనేత కార్మికులకు వేతనాలు పెరిగే విదంగా యాబై శాతం  సబ్సిడీలో ముప్పై ఐదు శాతం కార్మికుడికి వెతనం చేరేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిందని అయన వివరించారు. రాష్ట్రంలో చేనెత మగ్గాలు ఎక్కడ ఉన్నా వాటికి యీనిక్ కోడ్ ఏర్పాటు చేశాం

సామాజిక భద్రతా కోసం , చేనెతన్నకు చేయుతా అనే కార్యక్రమం ద్వారా కార్మికుడు రూపాయ కడితే రాష్ట్ర ప్రభుత్వం రెండు రూపాయలు ఇస్తుంది. చేనేత  కళాకారుల గుడ్డని రాష్ట్ర  ప్రభుత్వం కోనుగోలు చేస్తుంది. దేశవ్యాప్తంగా చేనేత కార్మికులకు హెల్త్ ఇన్సురేన్స్ ఎర్పాటు చేయ్యాలని కోరామని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం జీఎస్టీ పేరుతో అనేక శా్లాబ్ కిందా 5,10,18 శాతం వసులు చేస్తున్నారు. వాటి అన్నింటినీ ఒకే శ్లాబ్ కింది ఐదు శాతానికి తేవాలని కోరాం.తప్ప కుండా చేస్తాం అని మంత్రి అన్నారు. చేనేత కార్మికుల కోసం   లైప్ ఇన్సూరెన్స్ కూడా ఏర్పాటు చేయ్యాలని కోరాం. తెలంగాణలో పద్గాలు చేనేత క్లస్టర్స్ ఎర్పాటు చేయ్యాలని మంత్రిని కోరామని అయన అన్నారు. 

Related Posts