నిజామాబాద్ మార్చి 23,
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరా క్రాస్ రోడ్ వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వాహనాల్లో తరలిస్తున్న సుమారు మూడు క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నారు. సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి మెదక్ జిల్లా నారాయణఖేడ్ ప్రాంతం నుండి బొలెరో వాహనంలో తరలిస్తున్న గంజాయిని దానికి ఎస్కార్ట్ గా వ్యవహరిస్తున్న మరో షిఫ్ట్ డిజైర్ వాహనాన్ని వర్ని మండలం జాకోరా క్రాస్ రోడ్ వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. బొలెరో వాహనంలో 300 కిలోల గంజాయిని వేసి దానిపైన ఉల్లిపాయ బస్తాలు వేసి తరలిస్తుండగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. రెండు కిలోల చొప్పున ప్యాకెట్లు తయారు చేసి బియ్యం బస్తాలో వేసి బొలెరో వాహనంలో కింది భాగంలో గంజాయిని బస్తాలను వేసి వాటిపైన ఉల్లిపాయలను వేసి ఎవరికీ అనుమానం రాకుండా బొలెరో వాహనం లో తరలిస్తూ దానికి ఎస్కార్ట్ గా షిఫ్ట్ వాహనం వ్యవహరిస్తూ దాని వెనుక బొలెరో వాహనంలో గంజాయిని తరలిస్తూ ఉన్నారు.
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఖచ్చితమైన సమాచారం ఉండడంతో నేటి మధ్యాహ్నం నుండి ఇ వాహనాలను ఫాలో చేస్తూ వర్ని వద్ద పట్టుకున్నారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్న గంజాయి సుమారు మూడు క్వింటాళ్ల వరకు ఉంటుందని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ దీపిక తెలిపారు. గంజాయితో పాటు బొలెరో వాహనం ఒక షిఫ్ట్ డిజైర్ వాహనం తో పాటు ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సిఐ దీపిక వెల్లడించారు పట్టుకున్న గంజాయి మరియు వాహనాలతో ఐదుగురు వ్యక్తులను నిజామాబాద్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలిస్తున్నట్లు దీపిక పేర్కొన్నరు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సీఐ. ఎక్సైజ్ అధికారులు ఉన్నారు