YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

45 ఏళ్ల వ‌య‌సు దాటిన వారందరికీ క‌రోనా టీకా: కేంద్ర కీల‌క నిర్ణ‌యం

45 ఏళ్ల వ‌య‌సు దాటిన వారందరికీ క‌రోనా టీకా: కేంద్ర కీల‌క నిర్ణ‌యం

న్యూఢిల్లీ మార్చ్ 23  కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. 45 ఏళ్ల వ‌య‌సు దాటిన వారందరికీ క‌రోనా టీకా ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ ఇవాళ మీడియాతో ఈ విష‌యాన్ని తెలిపారు. ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి 45 ఏళ్లు దాటిన‌వాంద‌రికీ టీకా పంపిణీ చేయ‌నున్నారు. అర్హులైన వారంద‌రూ టీకా కోసం న‌మోదు చేసుకోవాల‌ని, వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. 60 ఏళ్లు దాటిన వారికి, 45 ఏళ్లు దాటి వ్యాధులు ఉన్న‌వారికి మాత్ర‌మే ప్ర‌స్తుతం టీకాలు ఇస్తున్న విష‌యం తెలిసిందే. శాస్త్ర‌వేత్త‌లు, ప్ర‌పంచ శాస్త్ర సంఘాల సూచ‌న మేర‌కు కోవిడ్ టీకా రెండ‌వ డోసును నాలుగు నుంచి 8 వారాల మ‌ధ్య తీసుకోవ‌చ్చు అని మంత్రి తెలిపారు. కోవీషీల్డ్ వ్యాక్సిన్‌కు ఈ నియమం వ‌ర్తిస్తుంద‌న్నారు. 45 ఏళ్లు దాటిన ప్ర‌తి ఒక్క‌రూ టీకా తీసుకొని కోవిడ్ నుంచి ర‌క్ష‌ణ పొందాల‌ని అభ్య‌ర్థిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు.

Related Posts