YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ దేశీయం

రాష్ట్రం లో పారిశ్రామీకీక‌ర‌ణ‌కు కేంద్రం ఎలాంటి సాయం చేయలేదు: కేటీఆర్

రాష్ట్రం లో పారిశ్రామీకీక‌ర‌ణ‌కు కేంద్రం ఎలాంటి సాయం చేయలేదు: కేటీఆర్

హైద‌రాబాద్ మార్చ్ 23 రాష్ట్రం లో పారిశ్రామీకీక‌ర‌ణ‌కు కేంద్రం ఎలాంటి సాయం చేయలేదని  మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా టీఎస్ ఐపాస్ కింద ప‌రిశ్ర‌మ‌లపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి కేటీఆర్ స‌మాధానం ఇస్తూ.. ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో తెలంగాణ‌, ఏపీ రాష్ర్టాల్లో పారిశ్రామీకీక‌ర‌ణ‌కు స‌హాయం చేయాల‌ని, రాయితీలు ఇస్తామ‌ని పేర్కొన్న‌ప్ప‌టికీ ఎలాంటి సాయం అంద‌లేద‌న్నారు. ఇప్ప‌టికైనా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక రాయితీల‌ను ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం కోరుతుంద‌న్నారు. ఆరున్న‌రేండ్ల‌లో తెలంగాణ‌కు కేంద్రం అణా పైసా కూడా స‌హాయం చేయ‌లేదు. కేంద్రం తెలంగాణ‌కు చేసింది గుండు సున్నా అని ధ్వ‌జ‌మెత్తారు. వారు పార్ల‌మెంట్‌లో చేసిన చ‌ట్టాన్నే తుంగ‌లో తొక్కుతున్నార‌ని నిప్పులు చెరిగారు. కేంద్రం తెచ్చిన రూ. 20 ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజీ ఏమైందో ఎవ‌రికి తెలియ‌ద‌న్నారు. ఈ ఆత్మ‌నిర్భ‌ర్ ప్యాకేజీ వ‌ల్ల తెలంగాణ‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌లేద‌న్నారు. కేవ‌లం వీధి వ్యాపారుల‌కు మాత్ర‌మే రూ. 10 వేల లోన్లు ఇచ్చార‌ని కేటీఆర్ తెలిపారు.

Related Posts