హైదరాబాద్ మార్చ్ 23
భారతదేశంలోని ఎంఎస్ఎంఇలో చాలా ముఖ్యమైన మార్పు సంభవించిందని ఆర్థిక సేవలను అందజేయడంలో వాణిజ్యరంగం ఒక కీలక చోదకశక్తిగా మారింది ఎస్ఒఎల్వి చీఫ్ సేల్స్ ఆఫీసర్ రోహిత్ డావెర్ తెలిపారు. ఈనాటి ఎంఎస్‌ఎంఇ రంగంలో నెలకొన్న 300 బిలియన్ డాలర్ల పెట్టుబడి వ్యత్యాసాలకు సమర్థమైన పరిష్కారంగా ఆవిర్భవించిందని తెలిపారు. నేడిక్కడ మీడియా తో మాట్లాడుతూ ఎంఎస్ఎంఇలు భారతదేశానికి వెన్నెముక, ఇది జిడిపిలో దాదాపు 30 %, శ్రామిక శక్తిలో 40%, ఎగుమతుల్లో 40% సమకూరుస్తున్నాయి. ఎంఎస్ఎంఇ రంగం ఏటేటా ~10% ఎదుగుదలను సాధిస్తోంది, ఆర్థికవ్యవస్థలోని వివిధ రంగాల్లో సాంకేతికతలో వేగవంతమైన పురోగతులు సంభవిస్తున్నప్పటికీ, వృద్ధికోసం సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకోలేకపోతోంది. ఎంఎస్ఎంఇలలో దాదాపు 80% వరకూ అసంఘటిత రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి, వాటి వ్యాపార కార్యకలాపాలను డిజిటల్‌గా కనిపెట్టగలిగే పరిస్థితి ఏమాత్రం లేదు. దీని ఫళితంగా, భారతదేశంలోని ఎంఎస్ఎంఇల్లో పెట్టుబడుల వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది, సాధారణ పెట్టుబడి మార్గాలను అవి కేవలం 4% మాత్రమే వినియోగించుకుంటున్నాయన్నారు.ఎంఎస్ఎంఇల సరఫరా గొలుసుకట్టును డిజిటలైజ్ చేయడంలో నవ్యావిష్కరణలకు ఒక పెద్ద అవకాశం నెలకొని ఉంది- ఆవశ్యకంగా దీని అర్థం ఏమిటంటే, వాటి మొత్తం ఎకోసిస్టమ్‌ను ఒక నమ్మకమైన వాతావరణంలోకి తీసుకురావాలి & వారి ప్రస్తుత కొనుగోలుదార్లు మరియు సరఫరాదార్ల జాబితాకు దాన్ని జతచేయడం ద్వారా విస్తృతపరచాలి. ఒక ఉత్పత్తిదారు నుంచి చిల్లరవిక్రయదారు వరకూ ఉండే ఈ రకమైన ఒక ఎకోసిస్టమ్‌లో ఎంఎస్ఎంఇలు భారీగా లాభం పొందగలుగుతాయి- మొత్తం సరఫరా గొలుసుకట్టు వారి వేళ్ళ అంచులమీద ఉంటుంది. ఇందులోని సౌకర్యం పూర్తి అసాధారణంగా ఉంటుంది, ప్రత్యేకించి, సూక్ష్మ & చిన్నతరహా వ్యాపారాలు ఖర్చును సమర్థవంతంగా తగ్గించుకొనే ఒక పద్ధతిలో అత్యుత్తమమైన ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి సమష్టి కొనుగోలు శక్తిని సంపాదించుకోగలవని తెలిపారు.మేము నమ్మేది ఏమిటంటే, సంప్రదాయ సరఫరా గొలుసుకట్టులను డిజిటలైజ్ చేయడం వల్ల చిన్న వ్యాపారాల మధ్య మొత్తం వాణిజ్య లావాదేవీల్లో వృద్ధి కోసం కొత్త మార్కెట్లు ఏర్పడడానికి దారి తీయడం మాత్రమే కాదు, సంప్రదాయికమైన ఆర్థిక వ్యవస్థలోకి ఈ రంగాన్ని తీసుకురావడంలో ఇది ముఖ్యమైన మలుపు కూడా అవుతుంది, తద్వారా, పొందదగిన వృద్ధినీ & నిర్వహణ మూలధనాన్ని సులువుగా అందుకోవడానికి దోహదపడుతుందని తెలిపారు.డేటా & సాంకేతికతలతో, భారతదేశంలో భారీగా ఉన్న రుణ వ్యత్యాసాలను పరిష్కరించడానికి ఒక ఆశాకిరణాన్ని అంతిమంగా మనం చూడగలుగుతున్నాం, ఈ వ్యత్యాసానికి కారణం భారతదేశంలో 60 లక్షల పైచిలుకు పటిష్టత ఉన్న ఎంఎస్ఎంఇ రంగం విషయంలో రుణ నిర్ణయాలను తీసుకోవడానికి డేటా & తగినంత సమాచారం లేకపోవడం.
ఆసక్తికరమైన విషయమేమిటంటే, బ్లాక్‌చైన్ & ఎఐ/ఎంఎల్ లాంటి సాంకేతికతలు విశ్వసనీయమైన డిజిటల్ ఎకోసిస్టమ్‌ను పటిష్టం చేస్తున్నాయి, కీలకమైన అనేక పనిసంబంధమైన లోపాలను పరిష్కరిస్తున్నాయి. ఎస్ఓఎల్‌వి స్కోర్‌ను నిర్మించడంలో ఎఐ/ఎంఎల్ పటిష్టమైన వినియోగాన్ని మనం చూస్తున్నాం, తద్వారా ఇండియాస్టేక్ పరపతిని వినియోగించుకుంటున్నాం & ఒక ప్రత్యామ్నాయ క్రెటిడ్ స్కోర్- ఎస్ఓఎల్‌వి స్కోర్‌ను సృష్టించడానికి బహిరంగంగా అందుబాటులో ఉన్న & సంప్రదాయికంగా అలిఖితమైన డేటాను, ప్లాట్‌ఫారమ్ డేటాతో ముక్కోణంగా ఉపయోగించుకుంటున్నాం, చిన్న వ్యాపార రంగం కోసం రుణ నిర్ణయాలు తీసుకోవడంలో ఇది ఆర్థిక సంస్థలకు సాయపడుతుంది. ఎంఎస్ఎంఇలతో సరైన ఆర్థిక సేవలు అందజేసే సంస్థలను అనుసంధానించడం, ఆర్థిక వేదికల సిఫార్సు యంత్రంగాన్ని శక్తిమంతం చేయడాన్ని వినియోగించడంబై ఆధారపడిన ఇతర కొన్ని గుర్తించదగిన సందర్భాలు ఉన్నాయన్నారు.చాలామంది చిన్నతరహా చిల్లర వ్యాపారులకు వారి అవసరాలకు పెట్టుబడులు పెట్టడానికి మూలధనం, నగదు లేని పరిస్థితుల్లో, ఎస్ఓఎల్‌వి బి2బి ప్లాట్‌ఫారమ్ ‘ఇప్పుడు కొనండి- తరువాత చెల్లించండి’ అనే కార్యక్రమం ద్వారా అందిస్తున్న ఇన్‌వాయిస్ అనుసంధానిత స్వల్పకాలిక రుణ పరిష్కారం కొవిడ్-19 కారణంగా సంక్షోభం తలెత్తిన ఈ కాలంలో ఒక ఎంఎస్ఎంఇలకు ఒక చేయూతను అందిస్తుంది. బిఎన్‌పిఎల్‌లోని సౌలభ్యత అందుబాటులోకి రావడంతో, చిన్న వ్యాపారాలు ఇప్పుడు వాటి తక్షణ అవసరాలను ఎలాంటి తీవ్రమైన ఆర్థిక బాధనూ అనుభవించకుండా తీర్చుకోగలుగుతాయి, చెల్లింపులు చేయడానికి వారికి ఎంతో సమయం ఉంటుంది.
ప్రాథమికంగా, తమ అవసరాలకు పెట్టుబడి సమకూర్చుకోవడానికీ, విక్రయాల ద్వారా నిధులు వచ్చిన తరువాత చెల్లించడానికీ ఎంఎస్ఎంఇలకు ఇది సాయపడుతుంది. ఎంఎస్ఎంఇల విక్రయాల మీద ప్రత్యక్ష ప్రభావం చూపించే నిల్వల స్థాయిని పెంచుకోవడానికి కూడా ఇది దోహదపడుతుంది.
మరింత ముందుకు వెళ్తే, ఈ సౌలభ్యమైన, ఖర్చుల్లో వ్యత్యాసం లేని చెల్లింపు పద్ధతి భారతదేశంలోని లక్షలాదిమంది సూక్ష్మతరహా పారిశ్రామికవేత్తలు ఎస్ఓఎల్‌వి లాంటి బి2బి ఇకామర్స్ వేదికల ద్వారా నాణ్యమైన ఉత్పత్తులను సౌకర్యవంతంగా సమకూర్చుకోవడానికి వీలు కలిగిస్తుంది, కరోనా మహమ్మారి అనంతర యుగంలో డిజిటల్ సరఫరా గొలుసుకట్టులలో ఈ తరహా పెట్టుబడుల పద్ధతి ఒక శాశ్వతమైన, గణనీయమైన ఒక భాగంగా ఏర్పడుతుందన్నారు.ఎస్ఓఎల్‌వి తాలూకు బిఎన్‌పిఎల్ పరిష్కారం ప్రత్యేకించి సూక్ష్మ & కొత్త- నుంచి- క్రెడిట్ చిల్లర వ్యాపారులకు బి2బి రంగంలో అందుబాటులో ఉన్న అత్యంత వేగమైన, సౌకర్యవంతమైన పెట్టుబడి రూపం. ఎస్‌ఓఎల్‌వి యాప్‌లో నమోదు ప్రక్రియ త్వరగా & ఆటంకాలు లేకుండా జరుగుతుంది. ప్లాట్‌ఫారమ్‌లో వ్యాపారి రెండు నిమిషాలు కెవైసి పరిశీలన పూర్తి చేశాక, అతనికి/ ఆమెకు తక్షణమే ఆహారం & ఎప్ఎంసిజి, వినియోగ ఎలక్ర్టానిక్స్, దుస్తులు లేదా హోరెకా లాంటి విభాగాల్లో లావాదేవీలు మొదలవుతాయని తెలిపారు.ఏ ఉత్పత్తినైనా టోకుగా ఆర్డర్ చేసే వ్యాపార ప్రదేశాలుగా బిఎన్‌పిఎల్ ఫైనాన్స్ తసౌకర్యవంతంగా అందుబాటులో ఉంటుంది. వ్యాపారి ఒక బ్యాంక్ క్రెడిట్ కార్డు కలిగి ఉండనక్కర్లేదు, ఒకే క్లిక్‌తో చెల్లింపులు జరిగిపోతాయి. సాధారణంగా ఏకైక యజమాని అయి ఉండి, కాలం ఎక్కువగా అవసరమయ్యే లాంఛనాలను పూర్తి చెయ్యడానికి మనుషుల్ని పెట్టుకోలేని వ్యాపారుల అవసరాలకు ఇది చక్కగా సరిపోతుంది.ఈ సౌకర్యం వర్చ్యువల్ క్రెడిట్ కార్డులా పని చేస్తుంది, ఇందులో ఎంఎస్ఎంవి రూ. 20,000 నుంచి రూ. 5,00,000 మధ్య తక్షణ ఆమోదం పొందిన పరిమితిని పొందవచ్చు. రూ. 3,000 మొదలుకొని ఏ మొత్తానికైనా ఎస్ఓఎల్‌వి ద్వారా ఏ కొనుగోళ్ళ కోసమైనా ఆ పరిమితిని వారు వినియోగించుకోవచ్చు నన్నారు.హలహీనమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా సంప్రదాయిక రుణదాతలు ఎక్కువగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని ఒక సమయంలో, ఎస్‌ఓఎల్‌వికి చెందిన ఎలాంటి ఇబ్బందులూ లేని బిఎన్‌పిఎల్ పథకం చిన్న వ్యాపారాల రోజువారీ నిర్వహణ అవసరాలను తీర్చడానికి ఒక సౌకర్యవంతమైన, అనుకూలమైన మార్గాన్ని అందిస్తోంది. కొత్త తరం డిజిటల్ రుణదాతలు కాన్సెప్ట్ లో ముందువరుసలో ఉన్నారు. కొత్తతరం రుణదాతలైన మూడు అగ్రశ్రేణి సంస్థలు- ఇండిఫి, ఇపేలేటర్, దావింతాలతో- ఈ చొరవ కోసం ఎస్ఓఎల్‌వి భాగస్వామి అయిందన్నారు.ఎంఎల్ఎంఇ రంగాన్ని డిజిటల్‌గా రూపాంతరీకరించే క్రమంలో ఎస్ఓఎల్‌వి ముందువరుసలో ఉంది, అతిపెద్దదైన, సేవలు ఏమాత్రం అందని ఈ విభాగాన్ని సంప్రదాయిక ఫైనాన్సింగ్ పరిధిలోకి తీసుకువస్తోంది. మోము సరికొత్తగా అందిస్తున్న, బి2బి సెగ్మెంట్‌లో బిఎన్‌పిఎల్‌ను మా 35000+ కొనుగోలుదార్లు, విక్రయదారులూ ఒకే విధంగా స్వాగతించారు. ఈ ఉత్పత్తి వారికి సౌకర్యవంతమైన, ఆర్థికమైన సానుకూలతను అందిస్తుంది, సవాలు విసరుతున్న ఈ సమయంలో సైతం వృద్ధిలో దాని ఫలితాలు కనిపిస్తాయన్నారు.ఈ వేదికపై మరింత విశ్వాసాన్ని ఎస్ఓఎల్‌వి పెంచుకోవడానికి బిఎన్‌పిఎల్ సాయడుతోంది, ఎందుకంటే ఇది ఇద్దరు భాగస్వాముల అవసరాలను తీరుస్తుంది- విక్రయదారులు వెంటనే చెల్లింపులను కోరుకుంటారు, కొనుగోలుదార్లు తమ జాబితాలో కొనుక్కొనే వాటికి రుణం కోసం ఫైనాన్స్ ఆశిస్తారు. ఎన్‌బిఎఫ్‌సి భాగస్వామ్యం కోసం, వారికి అందించే రుణ పరిమాణాలను పెంచడానికి బిఎన్‌పిఎల్ సాయం చేస్తోంది, ప్యాపార లావాదేవీల కోసమే ఫైనాన్సింగ్ అనేది అంతర్లీనమైన విషయం కాబట్టి, పెద్ద రిస్క్ ఎదురుకాకుండా వినియోగదారుల రుణ ప్రవర్తలను విశ్లేషించడానికి ఒక మార్గాన్ని వారికి అందిస్తోందని అన్నారు.ధోరణులను పరిశీలిస్తే, 2021 చివరినాటికి ప్రతి మూడు ఎఎస్‌ఎంఇలలో ఒకటి ఈ ఉత్పత్తిని వినియోగించుకుంటుంది. 2021లో రూ. 100 కోట్లకు పైగా విలువైన వ్యాపారాన్ని ఎస్ఓఎల్‌వి అందిస్తుందని బిఎన్‌పిఎల్ అంచనా వేస్తోందని తెలిపారు.
=