YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మున్సిపల్ కార్పొరేషన్ గా తాడేపల్లి

మున్సిపల్ కార్పొరేషన్ గా తాడేపల్లి

విజయవాడ, మార్చి 24,
మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కొద్ది రోజుల్లోనే జగన్ సర్కారు అనూహ్య నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి పరిధిలోకి వచ్చే మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలను కలిపి ఒకే కార్పొరేషన్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు మున్సిపాలిటీలను కలిపి మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌గా మారుస్తూ.. మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మీ ఉత్తర్వులు జారీ చేశారు.మంగళగిరి మున్సిపాలిటీతోపాటు.. దాని పరిధిలోని 11 గ్రామ పంచాయతీలు.. తాడేపల్లి మున్సిపాలిటీతోపాటు దాని పరిధిలోని మరో 10 గ్రామ పంచాయతీలను మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చారు. మున్సిపల్ యాక్ట్-1994 ప్రకారం ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.జగన్ సర్కారు మూడు రాజధానుల ఏర్పాటు దిశగా అడుగులేస్తున్నప్పటికీ.. అమరావతి ప్రాంతానికి చెందిన ప్రజలు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకే పట్టం కట్టారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలను ప్రత్యేకంగా చూస్తున్నారు.సీఎం జగన్ క్యాంపు ఆఫీసు ఉన్న తాడేపల్లితోపాటు మంగళగిరిలను మోడల్ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దుతామని వైసీపీ సర్కారు గతంలో హామీ ఇచ్చింది. ఇందుకోసం రూ.1100 కోట్లు అవసరమని అంచనా వేసింది. జగన్ సర్కారు 2020 ఫిబ్రవరిలో తాడేపల్లి మున్సిపాలిటీలోకి 8 గ్రామ పంచాయతీలను విలీనం చేసింది. రూరల్‌ మండలంలోని పెనుమాక, ఉండవల్లి, ఇప్పటం, మల్లెంపూడి, చిర్రావురు, వడ్డేశ్వరం, గుండిమెడ, ప్రాతురు గ్రామాలు తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి.ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 12 కార్పొరేషన్లకు ఎన్నికలను నిర్వహించారు. వీటిన్నింటిలోనూ వైసీపీ జయకేతనం ఎగురవేయగా.. ఒక్క విశాఖపట్నంలో మాత్రమే టీడీపీ కాస్త పోటీ ఇవ్వగలిగింది. కోర్టు కేసుల కారణంగా మంగళగిరి మున్సిపాలిటీతోపాటు రాజమండ్రి, శ్రీకాకుళం, నెల్లూరు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించలేదు.

Related Posts