తాడేపల్లి మార్చి 24,
కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలు మొక్క వొని ధైర్యం తో ఆందోళన కొనసాగిస్తున్నారు. వ్యవసాయ సంఘాలు ఈనెల 26 తేదీన భారత్ బంద్ కు పిలుపు నిచ్చాయి. విశాఖ ఉక్కు ప్రవేటీ కరణ వద్దని ఏపీలో నిరసన తెలుపుతున్నారు. రైతు సంఘాలు, విశాఖ ఉక్కు కార్మికులు.. పిలుపు నిచ్చిన భారత్ బంద్ కు మద్దతు ఇవ్వాలని ప్రభుత్వంని అడిగారని మంత్రి పేర్ని నాని అన్నారు. విశాఖ ఉక్కు ప్రవేటీ కరణ వద్దని.. జగన్మోహన్ రెడ్డి ప్రత్యామ్నాయ మార్గాలు సూచించినా కేంద్రం పెడచెవిన పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ను మేము కొనుగోలు చేస్తామంటే కేంద్రం అప్షన్ లో పాల్గొండి అనడం శోచనీయం. భారత్ బందుకు ప్రభుత్వం మద్దతు ప్రకటిస్తుంది. మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొనాలి. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం 1 గంట వరకు నిలుపుదల చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రన్ని దుర్మార్గం గా రాజకీయ క్రీడడ కోసం విడదీసింది కాంగ్రెస్ పార్టీ... అలాంటి కాంగ్రెస్ ఏ గతి పట్టిందో చూశారు. బీజేపీ కూడా ప్రత్యేక హోదాపై మాట మార్చితే కాంగ్రెస్ పార్టీ లా చేదు రుచి చూడాల్సి ఉంటుంది. టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లో ఎక్కడన్నా కనబడ్డారా...? మోడీకి పెళ్ళాములేదు నాకు మనవడు ఉన్నాడునేను ఆడుకుంటాను అన్నది ఎవరు...? చంద్రబాబు.. బామ్మర్ది తో మోడీ ని వచ్చి రాని భాషలో భూతులు తిట్టించలేదా....? సీఎం రమేష్ ,టీజీ వెంకటేష్ ను బీజేపీ లోకి రేవంత్ రెడ్డి ని కాంగ్రెస్ లోకి పంపింది చంద్రబాబేనని అయన అన్నారు. 2019 ఎన్నికల ఫలితాల్లో ప్రజలు టీడీపీ ని గట్టిగా కొట్టారు పంచాయతీ ఎన్నికలల్లో గుభ గుయిమనిపించారు మున్సిపల్ లో చావు దెబ్బ కొట్టారు. బీజేపీ చెప్పులు బూట్లు తుడిచింది టీడీపీ..వారే. టీడీపీ వారు ఐదేళ్ల లోఇసుకను దోచుకున్నారు. టీడీపీ వారు తన్నుకుంటుంటే ఇంటిజెన్స్ ఏబీ వెంకటేస్వరావు వాటాలు పంచుకోమని సెటిల్మెంట్ చేశారు. లోపాలు సరి చేసి పారదర్శకంగా ఇసుక అందిస్తుంన్నామని అన్నారు. ఐదేళ్ల లో టీడీపీ నాయకులు వందల కోట్లు దోచేశారు. ఐదేళ్లు దోచుకుని ఇప్పుడు దండుపాళ్యం గ్యాంగ్ లా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం పై ఇసుక విధానంపై టీడీపీ నేతలు బురద చల్లాలని చూస్తున్నారు. ఇప్పటికైనా టీడీపీవారు ప్రజల తీరు చూసి నిజాయి తితో కూడిన రాజకీయలు చేస్తే బాగుంటుందని అయన అన్నారు.