YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

శక్తికన్నా భక్తికే భలమెక్కువ

శక్తికన్నా భక్తికే భలమెక్కువ

రామాయణంలో హనుమంతుడు గురించి ఎంత చెప్పుకున్న తక్కువ. ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న ఈ పవనపుత్రుడు శ్రీ రాముడునే తన హృదయంలో బంధించి భక్తిలో ఎవరికీ సాటిరానంత ఎదిగాడు. ముఖ్యంగా సముద్రాన్ని దూకి లంకను చేరి సీతమ్మ జాడను రాముడికి చేరవేశాడు. శ్రీ రాముడు.. రావణుడిని వధించడంలో కీలక పాత్ర పోషించిన ఈ వీరాంజనేయుడు.. యుద్ధంలో లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోగా సంజీవిని తీసుకొచ్చి లక్ష్మణుడు ప్రాణాలు నిలిపిని మాహా ధీశాలి. రాముడి పట్ల తనకున్న అపారమైన భక్తితో చిరంజీవిగా ప్రజల గుండెల్లో నిలిచాడు. హనుమంతుడి గురించి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే రామాయణ గ్రంథం చదవితే తెలుస్తుంది. లోక కళ్యాణరాముడికి నిస్వార్థ భక్తి చూపిన వీరాంజనేయుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
​రామాంజనేయ యుద్ధం..
శ్రీ మహా విష్ణువు అవతారమైన రాముడిని తన హృదయంలో నిలుపుకున్న హనుమంతుడు.. ఏకంగా తన స్వామితోనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాశీ రాజు యయాతిని చంపాలని శ్రీ రాముడిని ఆదేశిస్తాడు విశ్వామిత్రుడు. అయితే స్వతహాగా రామభక్తుడైన యయాతి తాను ఎలాంటి పాపం చేయలేదని వీరంజనేయుడిని శరణు కోరతాడు. యయాతిని రక్షిస్తానని ఆంజనేయుడు అభయమిస్తాడు. మహర్షి ఆజ్ఞ ప్రకారం యయాతిని తనకి అప్పగించాలని హనుమంతుడిని శ్రీరాముడి ఆదేశిస్తాడు. యయాతికి మాటిచ్చానని, అవసరమైతే తన ప్రాణాన్ని అర్పిస్తానని యయాతిని మాత్రం ఇవ్వలేనని రాముడిని వేడుకుంటాడు పవనసుతుడు. ఇందుకు ఆగ్రహించిన శ్రీరాముడు.. హనుంతుడిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. అయితే ఆంజనేయుడు మాత్రం ఎలాంటి ఆయుధం లేకుండా రాముడిపై తనకున్న భక్తినే ఆయుధంగా చేసుకొని తన స్వామికి ఎదురునిలుస్తాడు. ఎన్ని అస్త్రాలు సంధించినా.. చివరికి రామబాణాన్ని ప్రయోగించిన రామభక్తి ముందు నిలువలేకపోతుంది. ఈ విధంగా శక్తి కంటే భక్తికే ఎక్కువ బలముందని హనుమంతుడు నిరూపించాడు.
ఓం నమో నారాయణాయ

Related Posts