YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*ఒకరి పుణ్యం మరొకరికి*

*ఒకరి పుణ్యం మరొకరికి*

*మా తల్లితండ్రుల తాతల పుణ్యఫలం వల్ల ఆశీర్వచనం వల్ల మేము సుఖంగా ఉన్నామనే మాట వినబడుతుంది.*
*ఒకరి పుణ్యం మరొకరికి ఎలా సంక్రమిస్తుంది?*
*అవశ్యమనుభోక్తవ్యం కృతంకర్మ శుభాశుభం అనికదా సూక్తి. కర్మ మరొకరికి సంక్రమిపజేయవచ్చునా* *అన్నది ప్రశ్న.*
*ఇక్కడ మనం విచారించ వలసిన అంశం జన్మపొందే జీవులు తన తల్లిదండ్రులను ఎన్నుకోవచ్చునా? లేదా యాదృచ్చికమైన గర్భప్రవేశమేనా అంటే ఇది యాదృచ్చికం కాదనీ, ఇక్కడా ఒక నియతి ఉందనీ తెలుస్తుంది.* *భగవంతుని అవతార కధలలో తల్లిదండ్రులు పూర్వజన్మలలో తపము చేసి సంతతిని పొందినట్లుగా ఉన్నది. యోగులు తపస్వులు కూడా తమ తల్లిదండ్రులను ఎన్నుకో వటం కూడా వారి జన్మగాధల లో గోచరిస్తుంది. భగవద్గీత చెప్తున్నది “శుచీనాం శ్రీమాతాం గేహే యోగభ్రష్టోభిజాయతే” అని.*
*తల్లితండ్రుల కర్మబలం వల్లనే తన కర్మబలం తోడి అనుకూల్యం వల్లనే జీవుడు గర్భప్రవేశం చేస్తాడని అనుకో వలసి ఉన్నది. పుట్టుకతోనే – రాజగృహంలోను పేద ఇంటి లోనూ పుట్టిన జీవులు తల్లిదండ్రుల కర్మానుభవ పరిమితులలోనే పెరుగుతారు కదా! సంతతి పరిణతి పొందే దాకా పొందే సుఖదుఃఖాలు తాను పెరిగిన ఇంటిలోనుంచి సంక్రమించేవే. ఇది చిత్రమైన సంక్లిష్టమైన వ్యూహపరిణతి. మాతా పితురులకు సంతతికి నడుమ కర్మఫల ప్రభావం తప్పకుండా ఉంటుంది. సంతతి శరీర ప్రాణ మనో భూమికల నిర్మాణంలో వంశ పారంపర్య లక్షణాలు సంక్రమించటం, అవి ఏర్పరచే పరిమితులలోనే జీవనం కొనసాగటం, కర్మ మార్గంలోనికి ప్రవేశించటం జరుగుతుంది. అందువల్ల జీవుని చిత్తంలో ప్రతిఫలించే పితరుల పుణ్య పాపములు సంస్కారాలకు చాలా వరకు హేతువులవు తున్నవి.*
*కొన్న్నికొన్ని సందర్భాలలో మాతాపితరులకు సంతతికి నడుమ అత్యంత వైరుధ్యం ఉన్న బ్రతుకు ధోరణులు కనిపిస్తాయి. ఇటువంటి పరిస్థితి సందర్భాలలో అలాంటి స్థితికి తల్లితండ్రుల గూఢ కర్మకానీ, పుత్రుల బలవత్ కర్మభావం కానీ హేతువులు కావచ్చును.*

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts