న్యూఢిల్లీ మార్చ్ 24
బ్యాంకుల్లో పనులు ఉంటే ఈ రెండు, మూడు రోజుల్లోనే చేసేసుకోండి. ఎందుకంటే ఈ నెల 27తో మొదలుపెడితే వచ్చే నెల 4 వరకూ బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి. శని, ఆదివారాలు, పండగలు, ఆర్థిక సంవత్సరం ముగింపు అంటూ మొత్తం 7 రోజుల పాటు బ్యాంకులకు తాళాలు పడనున్నాయి. మధ్యలో కేవలం మార్చి 30, ఏప్రిల్ 3న మాత్రమే బ్యాంకులు పని చేస్తాయి. ఈ శుక్రవారంలోపు మీ బ్యాంకు పని పూర్తి కాలేదంటే ఇక మీరు మరో పది రోజులు వేచి చూడాల్సిందే.
మార్చి 27: నాలుగో శనివారం సెలవు
మార్చి 28: ఆదివారం
మార్చి 29: హోలీ పండుగ సెలవు
మార్చి 31: ఆర్థిక సంవత్సరం ముగింపు సెలవు
ఏప్రిల్ 1: ఏడాది అకౌంట్లను పూర్తి చేయడానికి బ్యాంకులు మూతపడతాయి
ఏప్రిల్ 2: గుడ్ ఫ్రైడే సెలవు
ఏప్రిల్ 3 : శనివారం పని చేస్తాయి
ఏప్రిల్ 4: ఆదివారం
ఏడు రోజులు సెలవులు ఉన్నా.. ఏటీఎంలు, మొబైల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా పని చేస్తాయి