శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విదేశీ కరెన్సీ పట్టివేత
హైదరాబాద్
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇంటెలిజెన్స్ ఆధికారుల తనిఖీలు చేసారు. ఈ సోదాల్లో 1.3 కోట్ల విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుండి దుబాయ్ వెల్తున్న మహమ్మద్ అనే ప్రయాణికుడినుంచి ఈ కరెన్సీని పట్టుకున్నారు. కరెన్సీ తో పాటు నిందితుని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.