YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

అవార్డులు తప్ప కేంద్రం పైసా ఇవ్వడం లేదు: మంత్రి ఎర్ర‌బెల్లి

అవార్డులు తప్ప కేంద్రం పైసా ఇవ్వడం లేదు: మంత్రి ఎర్ర‌బెల్లి

హైద‌రాబాద్ మార్చ్ 24
 కేంద్ర ప్ర‌భుత్వం అవార్డుల మీద అవార్డులు ఇస్తోంది. తాను మోయ‌లేక చ‌స్తున్నా.. శాలువాల మీద శాలువాలు క‌ప్పుతున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌డం లేదని పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అన్నారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా గ్రామ‌పంచాయ‌తీల అభివృద్ధిపై ద‌యాక‌ర్‌రావు మాట్లాడుతూ..దేశంలో ఉత్త‌మ గ్రామపంచాయ‌తీలుగా, మండ‌లాలుగా మ‌న గ్రామాలు, మండ‌లాలు.. కేంద్రం నుంచి అవార్డులు పొందాయ‌ని మంత్రి తెలిపారు. ఇది మ‌నంద‌రికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. వాళ్లు ఇక్క‌డ ఊప‌డం కాదు.. డ‌బ్బు ఇవ్వాల‌ని కేంద్రాన్ని బీజేపీ నేత‌లు అడిగితే బాగుండు అని చుర‌క‌లంటించారు. ఇవాళ కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌శంసా ప‌త్రాల‌తో తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ముంచెత్తుతున్నారు కానీ.. నిధులు మాత్రం ఇవ్వ‌డం లేదు. చెత్త ఉన్న గుజ‌రాత్‌కు మాత్రం నిధులు ఇస్తారు. తెలంగాణ‌లోని గ్రామ‌పంచాయ‌తీల‌కు కేంద్రం నుంచి నిధులు రావ‌డం లేద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి అన్నారు.ఉపాధి హామీ ప‌నులు తెలంగాణ‌లో అద్భుతంగా జ‌రుగుతున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఉపాధి హామీ ప‌నుల విష‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తెలంగాణ సీఎంను, మంత్రుల‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. అద‌నంగా తాము పైస‌లు ఇవ్వాల‌ని అడ‌గ‌లేదు.. మ‌న‌కొచ్చే పైస‌లు ఇవ్వ‌మ‌ని అంటే అవి కూడా ఇవ్వ‌ట్లేదు అని మంత్రి ఎర్‌ంబెల్లి ద‌యాక‌ర్ రావు పేర్కొన్నారు.

Related Posts