YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం

అతని డైట్‌ ప్లాన్‌ ఏమిటి?

అతని డైట్‌ ప్లాన్‌ ఏమిటి?

డైట్‌ ప్లాన్‌తో బరువు తగ్గిన అనంత్‌

ఇంతకీ చోటా అంబానీ ఏం చేశాడు? ఏం తిన్నాడు?

జూనియర్‌ అంబానీ స్మార్ట్‌ టిప్స్‌

ఎలా ఉండేవాడు.. ఇంతలో ఎలా మారిపోయాడు? ముఖేష్‌ అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీ నిజంగానే మ్యాజిక్‌ చేశాడు. ఏకంగా 108 కిలోల బరువు తగ్గి స్మార్ట్‌ అయిపోయాడు. భారీ శరీరంతో నడవడానికే ఆయాసపడిన మనిషి.. ఇప్పుడు ఫిట్‌గా కనిస్తున్నాడు. ఇటీవల రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 40వ వార్షికోత్సవ వేడుకల్లో షారూఖ్‌ వంటి స్టార్లను కూడా ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ చోటా అంబానీ ఏం చేశాడు? ఏం తిన్నాడు? అతని డైట్‌ ప్లాన్‌ ఏమిటి?

బరువు తగ్గాలని చాలామందికి ఉంటుంది. అందుకు రకరకాల పద్ధతులు అనుసరిస్తూ ఉంటారు. తీసుకునే ఆహారం, తాగే నీళ్లు, వ్యాయామం, విశ్రాంతి.. ఇలా జాబితా కొనసాగుతూనే ఉంటుంది. కానీ ముందుగా డైట్‌పై దృష్టి పెడితే మిగతావన్నీ సహజంగానే దారిలో పడిపోతాయంటున్నాడు అనంత్‌ అంబానీ! ఏడాదిన్నరలో ఏకంగా 108 కేజీల బరువు తగ్గిన అనంత్‌..ఇప్పుడు స్టయిలి్‌షగా కూడా కనిపిస్తున్నాడు.

క్యాలరీ కంట్రోల్డ్‌ డైట్‌

సన్నబడాలనుకునేవారు మొట్టమొదట డైట్‌లో చక్కెర, కార్బోహైడ్రేట్స్‌ దూరం పెట్టాలంటున్నాడు అనంత్‌ అంబానీ! కావాల్సిన మోతాదులో ప్రొటీన్‌, ఫ్యాట్‌ ఫుడ్‌ తీసుకోవచ్చని చెబుతున్నాడు. రోజూ 1200 నుంచి 1400 క్యాలరీల ఆహారం తీసుకున్న అనంత్‌..తన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ వినోద్‌ చనా సూచించిట్లుగా రోజూ వ్యాయామం చేశాడు. డైట్‌ను స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యాడు. రోజూ కూరగాయలు, పనీర్‌, పప్పుధాన్యాలు, కాయధాన్యాలు తిన్నాడు. ఆహారంలో ఫైబర్‌, ఫ్యాట్స్‌, ప్రొటీన్స్‌, విటమిన్స్‌, మినరల్స్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. శాశ్వతంగా బరువు తగ్గాలనుకునేవారు పౌష్టికాహారంపై కూడా దృష్టిసారించాలని చెబుతున్నాడు. శరీరంలో హార్మోన్‌ మార్పులతో అనంత్‌ అంబానీ ఒకేసారి బాగా బరువు పెరిగాడు. ఈ సమస్య చాలామంది ఎదుర్కొంటారు. కానీ శరీరంలో మార్పులను అంగీకరిస్తూనే బరువు తగ్గడానికి కష్టపడాలని అంబానీల వారసుడు సూచిస్తున్నాడు.

జంక్‌ ఫుడ్‌ వద్దు

అనంత్‌ అంబానీకి చిరుతిళ్లు అంటే చాలా ఇష్టం. అవి తినకుండా ఒక్క రోజు కూడా ఉండలేకపోయేవాడు. కానీ క్యాలరీ కంట్రోల్డ్‌ డైట్‌ మొదలు పెట్టినప్పటి నుంచీ.. జంక్‌ ఫుడ్‌ను పూర్తిగా వదిలేశాడు. చీటింగ్‌ చేసి పిజ్జాలు, బర్గర్లు, పానీపూరీలు తింటే మీకేనష్టమంటున్నాడు. బరువు తగ్గడం కోసం అనంత్‌ అంబానీ రోజూ ఐదారు గంటలపాటు వ్యాయామం చేశాడు. ప్రతిరోజూ 21 కిలోమీటర్లు నడిచాడు. దీంతోబాటు యోగా, వెయిట్‌ ట్రైనింగ్‌, ఫంక్షనల్‌ ట్రైనింగ్‌, హై ఇంటెన్సిటీ కార్డియో ఎక్సర్‌సైజులు చేశాడు. వ్యాయామాన్ని కష్టంగా కాకుండా ఇష్టంగా చేస్తే ఖచ్చితంగా బరువు తగ్గుతారంటున్నాడు అనంత్‌ అంబానీ! మొత్తానికి బరువు తగ్గాలనుకునే లక్షలాదిమందికి చోటా అంబానీ స్ఫూర్తినిస్తున్నాడు.

Related Posts