YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రక్షాళన దిశగా గాంధీభవన్

ప్రక్షాళన దిశగా గాంధీభవన్

హైదరాబాద్, మార్చి 25, 
తెలంగాణ కాంగ్రెస్ ను సమూలంగా ప్రక్షాళన చేయాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించినట్లు తెలిసింది. పీసీసీ చీఫ్ తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జిని కూడా కొత్త వారిని నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. ఇందుకు పార్టీ అధినాయకత్వం కూడా సంకేతాలిచ్చింది. సీనియర్ నేతల అభిప్రాయాలను కూడా తీసుకన్న తర్వాత చర్యలకు దిగనుంది.నిజానికి పీసీసీ చీఫ్ ను నియమించాల్సి ఉంది. ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వరసగా రెండు ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తేలేకపోవడం, ఇప్పటికే కొన్నేళ్లుగా పీసీీసీ చీఫ్ గా కొనసాగడంతో ఆయనను తప్పించడం తప్పనిసరి. నిజానికి ఉత్తమ్ కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఓటమి పొందకపోయినా, ఫెయిల్యూర్ ఆయన ఖాతాలో పడింది. కాంగ్రెస్ లో నాయకత్వం లేకపోవడం వల్లనే రెండుసార్లు ప్రజలు తిరస్కరించారు.కాంగ్రెస్ పార్టీ గుర్తుమీద గెలిచిన నేతలు సయితం అధికార పార్టీ వైపు వెళ్లారు. రెండు సార్లు ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నా సీనియర్ నేతలు ఏమీ చేయలేకపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈసారి బలమైన నేతకు పగ్గాలు అప్పగించాలని డిసైడ్ అయింది. సామాజికవర్గాలు అని మడి కట్టుకుని కూర్చుంటే కుదరదన్న నిర్ణయానికి వచ్చారు. కాంగ్రెస్ ను గెలిపించే నేతకే పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని పార్టీ హైకమాండ్ డిసైడ్ అయిందంటున్నారు.ఇక మాణికం ఠాగూర్ ను కూడా ఇన్ ఛార్జి పదవి నుంచి తప్పించే అవకాశాలున్నాయి. ఆయన కంటే కుంతియాయే నయం అనిపిస్తున్నారు. నేతలను కలసి వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకునేందుకు కూడా మాణికం ఠాగూర్ ఇష్టపడటం లేదు. ఇప్పటికే దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ కు కొందరు నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత పీసీసీ చీఫ్, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఇన్ ఛార్జి మారడం ఖాయమని గాంధీభవన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Related Posts