YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రత్యామ్నయామేనా...

ప్రత్యామ్నయామేనా...

హైదరాబాద్, మార్చి 25, 
తెలంగాణలో బీజేపీకి ఎప్పటికైనా అవకాశాలున్నాయా? కనీసం టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా అయినా ఆవిర్భవిస్తుందా? అన్న అనుమానాలు బయలుదేరాయి. ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా బీజేపీపై తలెత్తుతున్న అసంతృప్తి తెలంగాణ పార్టీపై కూడా పడనుంది. ఇక్కడ కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలున్నాయన్నది విశ్లేషకుల అంచనా. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని విస్మరించామన్న అభిప్రాయం ఈసారి ప్రజల్లో బలంగా ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.2019 పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు పార్లమెంటు స్థానాలను గెలుచుకోగానే బీజేపీకి తెలంగాణలో కొంత బేస్ లభించినట్లయింది. అంతకు ముందు ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకున్న బీజేపీ పార్లమెంటు ఎన్నికల విషయానికి వచ్చే సరికి కొంత మెరుగుపర్చుకోగలిగింది. అయితే అప్పట్లో దేశ వ్యాప్తంగా ఉన్న మోదీ క్రేజ్, మరోసారి అధికారం ఇవ్వాలన్న ఆలోచన ఆ పార్టీకి నాలుగు స్థానాలు దక్కేలా చేశాయి.ఆ తర్వాత దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించడంతో ఇక బీజేపీ తిరుగులేదని భావించింది. కాంగ్రెస్ కు నూకలు చెల్లిపోయాయని నిర్ధారణకు వచ్చింది. అయితే రాను రాను కాంగ్రెస్ పై కొంత సానుభూతి పెరుగుతుంది. అధికార టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ వైపునకు క్రమంగా మళ్లుతుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీకి రెండుసార్లు అధికారం ఇవ్వలేకపోయామన్న భావన ప్రజల్లో బలంగా ఉంది.అందుకు బీజేపీ నేతలు ఎంత పోరాడుతున్నా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరడం లేదు. పెరుగుతున్న పెట్రోలు, గ్యాస్ ధరలు, నిత్యావసరాల వస్తువుల ధరలు నింగినంటాయి. రాష్ట్రానికి రావాల్సిన ఏ ప్రయోజనాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రతిపాదన కూడా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. రాబోయే రోజుల్లో బీజేపీకి తెలంగాణలో అన్ని కష్టాలేనని అంటున్నారు. కాంగ్రెస్ పై పెరుగుతున్న సింపతీ బీజేపీ ఎదుగుదలపై ప్రభావం చూపనుందంటున్నారు

Related Posts