అదిలాబాద్, మార్చి 25,
ఆయుష్ వైద్య సేవలు కనుమరుగవుతున్నాయి. సర్వరోగ నివారిణిలా భావించే ఆయుర్వేద వైద్యం అధికారుల నిర్లక్ష్యంతో అంపశయ్యపై కొట్టుమిట్టాడుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రులు నిరుపయోగంగా మారాయి. ఆసుపత్రి భవనాలు జీర్ణావస్థకు చేరుకోగా, మరికొన్ని చోట్ల సిబ్బంది కానరాక, మందులు దొరకక, వైద్యులు రాక వైద్య సేవలు ప్రజలకు అందనంత దూరంలో ఉంటున్నాయి. మరోవైపు వీటిలో పనిచేసే వైద్యులు, సిబ్బంది కొంతమంది విధులు నిర్వర్తించకున్నా, సుదూర ప్రాంతాల్లో నివాసముంటూ, జీతభత్యాలు మాత్రం దర్జాగా తీసుకుంటున్నారు.ఆయుర్వేదం, యోగా, యునాని, హోమియోపతి వైద్య ప్రక్రియలతో పేదలకు సంప్రదాయ వైద్యం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2007లో ఆయుష్ విభాగాన్ని ప్రారంభించాయి. నగరాలు, ప్రధాన పట్టణాల్లో వీటిని ఏర్పాటు చేసిన అనంతరం పల్లెలకు సైతం అందుబాటులోకి తీసుకురావాలని 2008లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆయుష్ సేవలను ప్రారంభించారు. ఇలా చేస్తే వారికి ఇంగ్లీషు వైద్యంతోపాటు ఈ వైద్యం కూడా అందుబాటులోకి వచ్చి ప్రజారోగ్యం మెరుగుపడుతుందని వీటిని ఏర్పాటు చేశారు. సాధారణ వ్యాధులతోపాటు మధుమేహం, రక్తపోటు బాధితులకు ఈ కేంద్రాల ద్వారా సేవలు అందించాలన్నది ప్రధాన ధ్యేయం. ఆయా పీహెచ్‌సీల్లో ఒక గదిని కేటాయించి ఒక వైద్యుడు, బంట్రోతును నియమించాల్సి ఉంది. కానీ ఇప్పటికి ఆయుర్వేద ఆసుపత్రులు శిథిలావస్థ భవనాల్లో కొనసాగిస్తూ వైద్యులను నియమించకుండా తత్సారం చేస్తున్నారు. ఉమ్మడి చేశారు. సాధారణ వ్యాధులతోపాటు మధుమేహం, రక్తపోటు బాధితులకు ఈ కేంద్రాల ద్వారా సేవలు అందించాలన్నది ప్రధాన ధ్యేయం. ఆయా పీహెచ్‌సీల్లో ఒక గదిని కేటాయించి ఒక వైద్యుడు, బంట్రోతును నియమించాల్సి ఉంది. కానీ ఇప్పటికి ఆయుర్వేద ఆసుపత్రులు శిథిలావస్థ భవనాల్లో కొనసాగిస్తూ వైద్యులను నియమించకుండా తత్సారం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 28 రెగ్యులర్ ఆయుర్వేద ఆసుపత్రుల్లో తొమ్మిది వైద్య పోస్టులు ఖాళీగా ఉండగా, 9 యూనాని ఆసుపత్రుల్లో నాలుగు వైద్య పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. హోమియో వైద్యశాలలు ఎనిమిదింటికి సగం దవాఖానాల్లో వైద్యులను నియమించలేదు. ఎన్‌ఆర్ హెచ్‌ఎం పథకంలో 23 ఆయుర్వేదిక్ ఆసుపత్రుల్లో ఇద్దరు వైద్యులే ఉన్నారు. హోమియో ఆసుపత్రులు 12 మందికి ముగ్గురు వైద్యులు పని చేస్తుండగా యునాని ఆసుపత్రులు 9 ఉండగా ఆరుగురు వైద్యులు లేరు. ప్రకృతివైద్యంలో ఇద్దరు వైద్యులకు ఒక్కరు మాత్రమే పని చేస్తున్నారు. రెగ్యులర్ పథకంలో 45 వైద్యులకు 16 వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్‌ఆర్‌హెచ్‌ఎంలో 46 దవాఖానాలుండగా 37 వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అక్కడక్కడా వైద్యులున్న చోట సైతం వారు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళతారో వారికి తప్ప ఇంకెవరికి తెలియని పరిస్థితి. దీంతో ఆయుష్ వైద్యసేవలు బాధితులకు ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు అందడం లేదు.ఆయుష్ ఆసుపత్రులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నామమాత్రంగానే మారాయి. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ఉన్న ఆయుష్ ఆసుపత్రిలో సైతం మందుల కొరత ఉంది. చిన్న వ్యాధులకు సైతం ఇక్కడ మందులు దొరకని పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలోనే అరకొర మందులతో నెట్టుకొస్తుండగా ఇక మిగితా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఆసుపత్రుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. అందుబాటులో వైద్యులు లేకపోవడం.. వైద్యులు ఉన్నా వారు ఏళ్ల తరబడి విధులకు గైర్హాజరవుతుండటంతో బంట్రోతులపైనే ఆధారపడి ఆసుపత్రులు కొనసాగుతున్నాయి. పైగా ఆసుపత్రుల నిర్వహణ తీరును పర్యవేక్షించకపోవడం.. ఉన్నతాధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో ఈ పరిస్థితి నెలకొంది.