నిజామాబాద్, మార్చి 25,
నిజామాబాద్ జిల్లాలో ప్రతి సంవత్సరం ఎండాకాలంలో రాష్ట్రంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. గత ఏడాది మే నెలలో 47 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యా యి. ఈ ఏడాది సైతం జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్ర త ప్రారంభమైంది. వారం రోజులుగా భానుడి ప్రతా పం కారణంగా పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు చేరాయి. 15 రోజుల కిందట 34 డిగ్రీలున్న ఉష్ణోగ్రత ప్రస్తుతం 40 డిగ్రీలకు చేరింది. ఉదయం 11 గంటలకు ఎండ తీవ్రత ప్రారంభమై సాయం త్రం 5 గంటల వరకు కొనసాగుతోంది. ఎండల కారణంగా జిల్లా కేంద్రంలోని పలు వీధులు జనసంచా రం లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉష్ణోగ్రత లు పెరిగిపోవడంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందు లు పడుతున్నారు. బయటకు వెళ్లేవారు ఎండల నుంచి తట్టుకొనేందుకు టోపీలు, తలకు కర్చీఫ్‌లు క ట్టుకుంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు పలు ప్రాంతాల్లో కొబ్బరిబోండాలు, చలువ పండ్ల రసాల దుకాణాలు వెలిశాయి. ప్రజలు నిమ్మరసం, కొబ్బరిబోండాలు, దోసకాయలు, శీతల పానియాలతో ఎండ నుంచి ఎ లాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా మార్చి నెలలో ఎండలు మండిపోతుండడంతో ఏప్రిల్, మేలో భానుడి ప్రతాపం మరెం త తీవ్రంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సమస్య ఎక్కువగా ఉండేది. ఎండాకాలంలో ఎప్పుడు కరెంటు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొనేది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జిల్లా వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సైతం నా ణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అవుతోంది. ప్రజలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను వాడుతున్నారు. దీంతో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ వినియోగం సైతం పెరిగింది.