YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఆనవాయితీ మారుస్తారా

ఆనవాయితీ మారుస్తారా

న్యూఢిల్లీ, మార్చి 25, 
భారతీయ జనతా పార్టీకి ఒక సంప్రదాయం అనాదిగా వస్తుంది. ఎక్కడ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలన్నా ఆ పార్టీకి ఎంపీలే దిక్కవతున్నారు. గతంలో గోవా నుంచి నిన్న ఉత్తరాఖండ్ వరకూ ఈ సంప్రదాయం బీజేపీ కొనసాగిస్తూనే ఉంది. స్థానిక నాయకత్వం బలంగా ఉన్నప్పటికీ పార్లమెంటు సభ్యులను ముఖ్యమంత్రులుగా డంప్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో గోవాలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు కేంద్రమంత్రిగా ఉన్న మనోహర్ పారేకర్ ను ముఖ్యమంత్రిగా బీజేపీ పంపింది. ఆయన చేత కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయించి మరీ సీఎం పీఠాన్ని అప్పజెప్పింది.ఇక గత ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అక్కడ స్థానిక నేతలు, బీజేపీకి తొలి నుంచి నమ్ముకున్న నేతలున్నప్పటికీ అప్పట్లో పార్లమెంటు సభ్యుడిగా ఉన్న యోగి ఆదిత్యనాధ్ ను ముఖ్యమంత్రిని చేశారు. ఎంపీగా ఉన్న కేశవ్ ప్రసాద్ మౌర్యను ఉప ముఖ్యమంత్రిగా చేశారు. సహజంగా ఎంపీ స్థాయి నేతలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇమేజ్ అంతంత మాత్రమే. అయినా బీజేపీ మాత్రం ఎంపీలను రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా డంప్ చేస్తుంది.ఇటీవల ఉత్తరాఖండ్ లో సంక్షోభం ఏర్పడింది. ముఖ్యమంత్రి తివేంద్రసింగ్ రాజీనామా చేశారు. నిజానికి ఉత్తరాఖండ్ లో బీజేపీ సీనియర్ నేతలు థన్ సింగ్ రావత్, భగత్ సింగ్ కోష్యారీ, రమేష్ పొఖ్రియాల్, సత్పల్ మహారాజ్ వంటి వారు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డారు. కానీ పార్లమెంటు సభ్యుడుగా ఉన్న తీర్థ సింగ్ రావత్ ను సీఎంగా బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈయన గతంలో రెండేళ్ల పాటు ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు.ముఖ్యమంత్రి అయిన తీర్థసింగ్ రావత్ కు ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ బలంగా ఉంది. ఆయనకు బీసీ సామాజికవర్గం అండ ఉంది. దీంతో పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఆయనను ముఖ్యమంత్రిగా బీజేపీ  ఎంపిక చేసింది. ఆర్ఎస్ఎస్ నిర్ణయాలే ఎక్కువగా బీజేపీ అధిష్టానం పై ప్రభావం చూపుతున్నాయన్నది ఈ ఎంపికను బట్టి తెలుస్తోంది. స్థానిక నాయకులు బలమైన వారున్నప్పటికీ ఎంపీలను ముఖ్యమంత్రులుగా ఎంపిక చేయడం ఆనవాయితీయా? అవసరమా? అన్నది కమలం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

Related Posts