YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పాదయాత్రకు రెడీ అవుతున్న మల్లన్న

పాదయాత్రకు రెడీ అవుతున్న మల్లన్న

వరంగల్, మార్చి 25, 
ప్రభుత్వాన్ని తనదైన శైలిలో విమర్శిస్తూ ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి తీన్మార్ మల్లన్న అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మాట్లాడుతూ మంత్రి ఈటల రాజేందర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఈటలకు టీఆర్ఎస్‌లో అన్యాయం జరుగుతున్న మాట నిజమేనని అన్నారు. ఈటలకు జరుగుతున్న అన్యాయాన్ని తాను గతంలోనే ఖండించానని మల్లన్న గుర్తుచేసుకున్నారు. అయితే, ఈటలను తాను రాజకీయంగా కలవాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. బీజేపీ నేత బండి సంజయ్ తనకు లక్ష ఓట్లు వేయిస్తే.. మరి బీజేపీ అభ్యర్థికి ఎందుకు ఆయన ఓట్లు వేయించలేకపోయాడని మల్లన్న ప్రశ్నించారు.బండి సంజయ్, తాను ఒకే కులమైతే ఏంటని, తమ సిద్ధాంతాలు వేరని తీన్మార్ మల్లన్న నొక్కి చెప్పారు. తాను కులాలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిని కాదని, దయచేసి తనపై కుల ముద్ర వేయొద్దని మల్లన్న సూచించారు. 45 కేజీల సీఎం కేసీఆర్ శరీరంతో తనకు ఏ మాత్రం ద్వేషం లేదని.. ఆయన మెదడు తీసుకునే కీలకమైన నిర్ణయాలనే తాను వ్యతిరేకిస్తున్నట్లు తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..నాకు ప్రజలు ఓట్లతోపాటు, నోట్లు కూడా ఇచ్చారు. నా అనుచరులు ఒక్క రోజు టీ తాగకపోతే రూ.5 కోట్లు జమ అవుతాయి. అలాంటప్పుడు కాంగ్రెస్ నేత రేవంత్, వైఎస్ షర్మిల ఇవ్వజూపే డబ్బులు నాకెందుకు అవసరం? నేను బీజేపీ సహా ఏ పార్టీలోను చేరే ప్రసక్తే లేదు. త్వరలో జరగనున్న నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించాలని నేను అక్కడి ఓటర్లకు పిలుపునిస్తున్నా. అంతేకాక, త్వరలో తెలంగాణ వ్యాప్తంగా 6 వేల కిలోమీటర్ల పాదయాత్రకు ప్రణాళిక సిద్ధమైంది. ఢిల్లీలో తాను కొత్త పార్టీ పెట్టాలని చూస్తున్నట్లు వస్తున్న ప్రచారం ఒట్టిదే. పార్టీ రిజిస్ట్రేషన్ చేయాలని చూడడం అంతకంటే అబద్ధం. అసెంబ్లీ అంటే తెలియని వారిని నాతో పాటు అసెంబ్లీ గడప తొక్కిస్తా’’ అని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేశారు.

Related Posts