YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

మాస్క్ తప్పనిసరి

మాస్క్ తప్పనిసరి

కాకినాడ  మార్చి 25, 
కోవిడ్ సెకండ్ వేవ్ కేసులు పెరుగుతు న్న నేపద్యంలో తూర్పు గోదావరి జిల్లాలో మాస్క్ ధారణ ప్రతి ఒక్కరూ తప్పని సరిగా పాటించాలని, మాస్క్ లేకుండా సంచరించే వారి కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామని  జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి స్పష్టం చేసారు.జిల్లాలో కోవిడ్ పాజిటీవ్ కేసుల నమోదు మరల పెరుగుతున్న దృష్ట్యా టెస్టింగ్, కాంటాక్ట్ ట్రాకింగ్, ఐసోలేషన్ చర్యలతో పాటు ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్ర మాన్ని మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.  జిల్లాలో హెల్త్ కేర్ వర్కర్లు 6,349 మంది తొలి డోసు, 7994 మంది రెండవ డోస్ వేయించుకోవలసి ఉందన్నారు.  అలాగే  ఫ్రంట్ లైన్ వర్కర్లు 23948 మంది తొలి డోసు, 22,377 మంది రెండవ డోస్ వేయించుకోవాల్సి ఉందన్నారు. కోవిడ్ నియంత్రణలో కీలకమైన వీరందరూ వ్యాక్సిన్ తప్పని సరిగా పొందేట్లు చూడాలని ఆధికారులను కోరారు.  మూడవ దశ వాక్సినేషన్ క్రింద ప్రస్తుతం నిర్వహిస్తున్న 236 వ్యాక్సినేషన్ సెంటర్లతో పాటు ప్రతి పి హెచ్ సి పరిధిలో నాలుగు గ్రామ సచివాల యాలలో సోమ, బుధ, గురు, శని వారాలలో మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ పంపిణీ నిర్వహించాలని మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఆదేశించారు.  ఇందులో కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్ పరిధిలో ట్రయల్ విధానంలో సచివాలయల్లో వాక్సినేషన్ ప్రారంభించాలని సూచించారు.

Related Posts