YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రూ.494 కోట్లతో వెయ్యి అపార్టుమెంట్లు వేలం పద్ధతిలో ప్రజలకు విక్రయం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడి

రూ.494 కోట్లతో వెయ్యి అపార్టుమెంట్లు      వేలం పద్ధతిలో ప్రజలకు విక్రయం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడి

అమరావతిలో వివిధ సంస్థల్లో పనిచేసే ప్రైవేటు ఉద్యోగాలతో పాటు ఇతరుల కోసం రూ.494 కోట్ల వ్యయంతో వెయ్యి అపార్టుమెంట్లు నిర్మించనున్నామని, వాటిని వేలం ద్వారా వారికి విక్రయించనున్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. ఈ అపార్టుమెంట్లను మూడు కేటగిరిలో నిర్మించనున్నామన్నారు. రాష్ట్రంలో 71 మున్సిపాల్టీల్లో 203 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. సచివాలయంలోని నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని భూ సేకరణలో భాగంగా ల్యాండ్ పూలింగ్ కింద మిగిలిన 1500 ఎకరాలపై చర్చజరిగినట్లు మంత్రి నారాయణ తెలిపారు. సిటీ కోర్టు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తున్నామన్నారు. కోర్టులు అమరావతికి వచ్చిన తరవాత దాంట్లో ఎందరో ఉద్యోగులు ఉంటారన్నారు. వారితో పాటు ప్రైవేటు ఉద్యోగులు కూడా ఉంటారన్నారు. వారందరికీ కోసం రూ.494 కోట్లతో వెయ్యి అపార్టుమెంట్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబునాయుడు అనుమతులిచ్చారన్నారు. ఏడాదిలోగా ఈ నిర్మాణాలు పూర్త చేయాలనే ఉద్దేశంతో త్వరలో టెండర్లు పిలవడానికి సీఆర్డీయే చర్యలు చేపట్టిందన్నారు. జి+11 పద్థతిలో చేపట్టే ఈ అపార్టుమెంట్ల నిర్మాణానికి ప్రభుత్వం 10 ఎకరాలు కేటాయించిందన్నారు. వేలం పద్ధతిలో అపార్టుమెంట్లు విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఫస్ట్ ఫేజ్ లో  ఈ నిర్మాణాలు చేపడతామన్నారు. ప్రజల నుంచి వచ్చిన స్పందనను బట్టి మరిన్ని అపార్టుమెంట్ల నిర్మాణం చేపడతామన్నారు. 1200 చదరపు అడుగుల్లో 500ల అపార్టుమెంట్లు, 1500 చదరపు అడుగుల్లో 300లు, 1800 చదరపు అడుగుల్లో 200లు.. ఇలా మూడు కేటగిరీల్లో రాజధాని పక్కన నిర్మించనున్నామన్నారు. నో లాస్...నో ప్రాఫిట్ విధానంలో ఈ అపార్టుమెంట్లను చదరపు అడుగు రూ.3,500లకు విక్రయించనున్నామని మంత్రి తెలిపారు. కోర్టుల్లో పనిచేసే లాయర్లకు ఈ అపార్టుమెంట్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు.  రాష్ట్రంలో మొదటి విడతగా 71 మున్సిపాల్టీల్లో 203 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ ఉంటుందన్నారు. లంచ్, డిన్నర్ ఖరీదు రూ.5ల అని మంత్రి తెలిపారు. బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, పొంగల్, ఉప్మా ఉంటాయన్నారు. ఇడ్లీ రేటు రూపాయి అని తెలిపారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ఇప్పటికే స్థలాలు గుర్తించామన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇతర శాఖలకు చెందిన భూములు కూడా ఉన్నాయన్నారు. వాటిని అన్న క్యాంటీన్లు నిర్మాణానికి కేటాయిస్తూ బుధవారమే జీవో జారీచేయనున్నట్లు తెలిపారు. 

Related Posts