YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికకు అన్ని ఏర్పాట్లు కలెక్టర్ చక్రధర్ బాబు

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికకు అన్ని ఏర్పాట్లు  కలెక్టర్ చక్రధర్ బాబు

నెల్లూరు మార్చి 25 జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాలు, చిత్తూరు జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 17 లక్షల 80 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని జిల్లా కలెక్టర్ & రిటర్నింగ్ అధికారి  కె.వి.ఎన్.చక్రధర్ బాబు తెలిపారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా జిల్లా కలెక్టర్ & రిటర్నింగ్ అధికారి గురువారం మాట్లాడుతూ,2500 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ప్రజలను కూడా భాగస్వామ్యులను చేయడానికి సి-విజిల్ యాప్ ని కేంద్రం ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను గమనించిన సాధారణ ప్రజలు సైతం.., సి-విజిల్ యాప్ ద్వారా తమ ఫిర్యాదులను జిల్లా ఎన్నికల కంట్రోల్ రూంకి పంపిచవచ్చన్నారు. సి-విజిల్ యాప్ ద్వారా వీడియోలు, వాయిస్ రికార్డులు, ఫోటోలు పంపించే సదుపాయం ఉందన్నారు. తమకు సంబంధించిన ఎలాంటి వ్యక్తిగత వివరాలను తెలియకుండా, కంట్రోల్ రూంకి ఫిర్యాదులు చేసే సదుపాయం సి-విజిల్ యాప్ లో ఉందని వెల్లడించారు. ఫిర్యాదు అందిన 15 నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకునేలా ఫ్లైయింగ్ స్కాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు, వీడియో సర్వేలెన్స్ టీంలు, స్పెషల్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా సి-విజిల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదులను మానిటర్ చేయడానికి నోడల్ అధికారిగా నెల్లూరు ఆర్.డి.ఓ హుస్సేన్ సాహెబ్ ని  నియమించామన్నారు.
వేసవి కాలం, కోవిడ్ ప్రోటోకాల్ దృష్ట్యా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, మంచినీటిని అందుబాటులో ఉంచడంతో పాటు  హెల్ప్ డెస్కులు, ఫస్ట్ ఎయిడ్ అందించడానికి వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నామన్నారు. థర్మల్ స్కానర్ ద్వారా చెక్ చేసిన తర్వాతనే ఓటర్లను పోలింగ్ కేంద్రంలోనికి అనుమతిస్తామన్నారు. పోలింగ్ కేంద్రంలో మాస్కులు, శానిటైజర్లను కూడా అందుబాటులో ఉంచుతున్నామన్నారు.
ఓటర్ల వెసులుబాటు కోసం పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పెంచింది అని.., 17న ఉదయం 7.00 గం. నుంచి రాత్రి 7.00 గం. వరకూ పోలింగ్ జరుగుతుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా కూడా నామినేషన్లు దాఖలు చేయవచ్చన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ ద్వారా ప్రజలందరూ చూసేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఓటర్స్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ప్రజలు తమ ఓటు హక్కు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందనే వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలతో పాటు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించడానికి 1950 టోల్ ఫ్రీ నంబరు అందుబాటులో ఉందన్నారు.  జిల్లా స్థాయిలో కంట్రోల్ ని కూడా ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాలని తెలిపారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు దీనిని గమనించి పూర్తి స్థాయిలో ఎన్నికల సిబ్బందికి సహకరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న లైసెన్స్ డు వెపన్స్ సీజ్ చేశామని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు జరగకుండా అన్ని చర్యలు  తీసుకుంటున్నామన్నారు. సరైన ఆధారులు లేకుండా డబ్బును క్యారీచేస్తుంటే..,  స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేయడం జరుగుతుందని, ప్రజలు కూడా దీనిని గమనించి వ్యక్తిగత అవసరాల కోసం పెద్ద మొత్తంలో మనీని డ్రా చేసి తీసుకువెళ్లకుండా ఆన్ లైన్ సేవలను వినియోగించుకోవాలన్నారు.  అనుమానంగా కనిపిస్తే ప్రత్యేక బృందాలు డబ్బును సీజ్ చేస్తాయన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జిల్లా స్థాయిలో ఓ కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ సభ్యులు సీజ్ చేసిన మనీని పరిశీలించి, ఆ డబ్బు ఎన్నికలకు సంబంధించిన డబ్బు కాదని తెలిస్తే తిరిగి అందజేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ప్రజలు కూడా భాగస్వామ్యులు కావాలన్నారు. ఓటింగ్ సమయంలో దివ్యాంగులు ముందుగానే తాము ఏ సమయంలో ఓటు వేయాలనుకుంటున్నారో, ఆ సమయానికి ఓటు వేసేలా  పిడబ్ల్యుడి ని ఎన్నికల సంఘం రూపొందించిందన్నారు. పిడబ్ల్యుడి యాప్ సేవలు దివ్యాంగులు వినియోగించుకోవాలన్నారు. తిరుపతి లోక్ సభా నియోజకవర్గం పరిధిలో సుమారు 25,000 మంది దివ్యాంగులు ఉన్నారని, ఏ పోలింగ్ కేంద్రంలో ఎంతమంది దివ్యాంగులు ఉన్నారో ముందుగానే అధికారులు గుర్తించారని, పోలింగ్ కేంద్రంలో దివ్యాంగులకు సహాయం చేయడానికి రెడ్ క్రాస్ వాలంటీర్లను, వీల్ ఛైర్స్ ని కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నిక జరుగుతున్న పోలింగ్ కేంద్రం వెలుపల క్యూలో ఎంతమంది ఉన్నారు అని తెలుసుకోవడానికి ఎన్నికల సంఘం ఆన్ లైన్ ద్వారా ఏర్పాటు చేసిందన్నారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ నుంచి ఎన్నికల ఫలితాల వరకూ అన్ని వివరాలను ఆన్ లైన్ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ & రిటర్నింగ్ అధికారి  కె.వి.ఎన్.చక్రధర్ బాబు తెలిపారు.

Related Posts