YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఉయ్యాల వాడ ఎయిర్ పోర్ట్ ప్రారంభం

ఉయ్యాల వాడ ఎయిర్ పోర్ట్ ప్రారంభం

ఉయ్యాల వాడ ఎయిర్ పోర్ట్ ప్రారంభం
కర్నూలు, మార్చి 25, 
కర్నూలు ఎయిర్‌పోర్టు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓర్వకల్లులో విమానాశ్రయంలో జ్యోతి వెలిగించి, ప్రత్యేక తపాలా స్టాంపు ఆవిష్కరించారు. టెర్మినల్‌ భవనం దగ్గర రాజశేఖర్‌రెడ్డి విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం విమానాశ్రయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కర్నూలు చరిత్రలో ఈ రోజు ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు జగన్. చంద్రబాబు రిబ్బన్ కట్ చేసి వదిలేశారని.. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేశామని.. న్యాయ రాజధానికి ఇక విమానాలతో కనెక్టివిటీ పెరిగిందన్నారు. ఒకేసారి నాలుగు విమానాలు పార్క్ చేసుకునే అవకాశం ఉందన్నారు. మరోవైపు ఈ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ప్రకటించారు.ఇక కర్నూలు ఎయిర్‌పోర్టు నుంచి ఈ నెల 28న సర్వీసులు ప్రారంభంకానున్నాయి. ఇండిగో బెంగళూరు, చెన్నై, విశాఖకు సర్వీసులను నడపనుంది. బెంగళూరు నుంచి విమానం ప్రతి సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ఉదయం 9.05 గంటలకు బయలుదేరి 10.10 గంటలకు కర్నూలు వస్తుంది. అదేరోజు మధ్యాహ్నం 3.15 గంటలకు కర్నూలు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 4.25 గంటలకు బెంగళూరు చేరుకోనుంది. ప్రతి సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో కర్నూలు నుంచి ఉదయం 10.30 గంటలకు బయలుదేరి విశాఖకు 12.40 గంటలకు చేరుతుంది. తిరిగి విశాఖ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి 2.55 గంటలకు కర్నూలు చేరుకుంటుంది.చెన్నై నుంచి ప్రతి మంగళ, గురు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి కర్నూలుకు 4.10 గంటలకు చేరుకుంటుంది. అదే రోజుల్లో కర్నూలు నుంచి సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి చెన్నైకి సాయంత్రం 5.50 గంటలకు చేరుతుంది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు కోరారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్, తిరుపతి, విజయవాడలకు కనెక్టివిటీ ఫ్లైట్స్ రన్ కోసం ప్రతిపాదిస్తామని కలెక్టర్ తెలిపారుఁ నా కెంతో ఆనందంగా ఉంది : చిరంజీవి
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో విమానాశ్రయాన్ని సీఎం జగన్ నేడు (గురువారం) ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్టుగా నామకరణం చేశారు. ఈ నెల 28 నుంచి ఓర్వకల్లులో విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రావడంతో కర్నూలు వాసులు ఉత్సాహంగా ఉన్నారు. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పేరును ఈ విమానాశ్రయానికి పెట్టడం పట్ల మెగాస్టార్గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటనతో ఆనందంలో మునిగితేలుతున్నా. భారత ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. గొప్ప దేశభక్తుడు, నిజమైన యోధుడు.. ఆయన ఈ గుర్తింపునకు పూర్తి అర్హుడు. అలాంటి గొప్ప వ్యక్తి పాత్ర పోషించే అవకాశం లభించడం నిజంగా నా అదృష్టం’’ అంటూ తన ‘సైరా’ సినిమా అనుభవాలను గుర్తుకు తెచ్చుకున్నారు.2019 అక్టోబర్‌లో సతీ సమేతంగా విజయవాడ వెళ్లిన చిరంజీవి.. సీఎం జగన్‌ను కలిశారు. మెగాస్టార్‌ను తన ఇంటికి ఆహ్వానించిన జగన్.. అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా సైరా సినిమా చూడాలని సీఎంను చిరంజీవి కోరారు. గత ఏడాది మే నెలలో జగన్‌కు ఫోన్ చేసిన చిరంజీవి.. సినీ ఇండస్ట్రీకి మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

Related Posts