YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రివిలేజ్ నోట్ తో... నిమ్మగడ్డ కు కోపం

ప్రివిలేజ్ నోట్ తో... నిమ్మగడ్డ కు కోపం

విజయవాడ, మార్చి 26, 
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించకపోవడానికి అనేక కారణాలు కన్పిస్తున్నాయి. ఆయన కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న రోజుల్లోనే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోయినా పట్టుబట్టి న్యాయస్థానం ఆదేశాలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను నిర్వహించారు. తొలి షెడ్యూల్ కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పక్కన పెట్టి పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. నిజానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. ఈ మేరకు అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. కానీ వరసగా జరిపిన ఎన్నికల్లో అధికార వైసీపీ అఖండ విజయం సాధించడం, ప్రజలు ఏకపక్షంగా తీర్పు చెప్పడం కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వెనకడుగు వేయడానికి కారణమయింది. మరోవైపు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఇబ్బంది పెట్టాయని అంటారు. తనను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావించారు. ఇక ప్రభుత్వంతో తనకు పడదని భావించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. నిజానికి ఇన్ని ఎన్నికలను నిర్వహించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడం పెద్ద కష్టమేమీ కాదు. కేవలం ఆరు రోజుల ప్రక్రియ మాత్రమే ఉంది. అయినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక్కు తగ్గడానికి ప్రభుత్వంతో పేచీ పెట్టుకోవడం ఈ సమయంలో ఎందుకని ఆయన భావించారంటారు. పైగా ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేస్తుండటంతో తనకెందుకొచ్చిన ఇబ్బంది అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావించారు. పైగా టీడీపీ, జనసేన వంటి పార్టీలు కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయడానికి ఇష్టపడలేదు.

Related Posts