YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఎలా

ఇంటర్ ప్రాక్టికల్స్  పరీక్షలు ఎలా

వరంగల్, మార్చి 26, 
ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగుతాయా? లేదా?అన్నది చర్చనీయాంశంగా మారింది. కరోనా ఉధృతి నేపథ్యంలో బుధవారం నుంచి పాఠశాలలతోపాటు కాలేజీలకూ ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చేనెల 7 నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగుతాయని ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. వచ్చేనెల ఒకటిన నైతికత, మానవ విలువలు, 3న పర్యావరణ విద్య పరీక్షలుంటాయంటూ ఇప్పటికే షెడ్యూల్‌ను విడుదల చేసింది. విద్యాసంస్థలు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవ డంతో విద్యార్థులు, అధికారులు, అధ్యాపకులు ఆందోళనలో ఉన్నారు. ప్రాక్టికల్స్‌, ఈ పరీక్షలపై స్పష్టత లేకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. ఇంకోవైపు కరోనా విజృంభించడంతో గత విద్యాసంవత్సరంలో మూతపడిన విద్యాసంస్థల్లో 2020, సెప్టెంబర్‌ ఒకటి నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్‌ పాఠాలు ఎంత మంది విన్నారో, అది ఎంత మందికి అర్థమైందనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటి నుంచి 9,10, ఇంటర్‌ ఆపై తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో ఇంటర్‌ సిలబస్‌లో 30 శాతం కుదించారు. 70 శాతం సిలబస్‌ను మాత్రమే విద్యార్థులకు బోధిస్తున్నారు. సిలబస్‌ను పూర్తి చేసేందుకు బోధనపైనే అధ్యాపకులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ చదివే విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ జరగడం లేదు. దీంతో ఈ ఏడాది ప్రాక్టికళ్లు జరుగుతాయా? లేదా?అన్నది ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థులకు నైతికత, పర్యావరణ విద్య తరహాలో వైవా లేదంటే ప్రాక్టికల్స్‌కు సంబంధించిన సబ్జెక్టులతో ఏదైనా పరీక్ష నిర్వహిస్తే బాగుంటుందని అధ్యాపకులు సూచిస్తున్నారు.రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్‌, గురుకులాల్లో కలిపి ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో 1.70 లక్షల మంది, బైపీసీలో లక్ష మంది, ఒకేషనల్‌ కోర్సుల్లో 49 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి ప్రాక్టికల్స్‌ నిర్వహించాలి. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు థియరీ పరీక్షల్లో వచ్చే మార్కులోపాటు ఈ మార్కులు కలుస్తాయి. ఎంపీసీ విద్యార్థులకు ఫిజిక్స్‌, కెమిస్ట్రీకి 30 మార్కుల చొప్పున 60 మార్కులుంటాయి. బైపీసీ విద్యార్థులకు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీకి సబ్జెక్టుకు 30 మార్కుల చొప్పున 120 మార్కులు కలుస్తాయి. ఇంకోవైపు ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఉన్నది. దీంతో ఇంటర్‌ మార్కులకు, ఇంటర్‌ ప్రాక్టికళ్లకు ప్రాధాన్యత ఉంటుంది. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించాలంటే ఖర్చుతో కూడుకున్నది. రికార్డులు రాయడం, ప్రయోగాలు చేయడం, పిప్పెట్‌, బ్యూరెట్‌, మైక్రోస్కోప్‌, కప్పలతోపాటు ఇతర వస్తువులు, రసాయనాలు అవసరమవుతాయి. కరోనా కాలంలో ఇవన్నీ సాధ్యమయ్యేది కాదని కొందరు అధ్యాపకులు వాపోతున్నారు. మరోవైపు ఇప్పటి వరకు ప్రాక్టికల్‌ పరీక్షలకు సంబంధించిన పాఠాలు విద్యార్థులకు బోధించలేదని తెలుస్తున్నది. కొన్ని ప్రభుత్వ కళాశాలల్లో మాత్రమే విద్యార్థులకు చెప్పినట్టు సమాచారం. ప్రయివేటు, కార్పొరేట్‌ జూనియర్‌ కాలేజీల్లో ప్రాక్టికల్స్‌ అంటే ఏమిటీ? అన్న విద్యార్థుల నుంచి వచ్చినా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. సాధారణంగానే ప్రాక్టికల్స్‌ నిర్వహించకుండా పూర్తి మార్కులు వేయించడం కార్పొరేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు ఏటా అనుసరిస్తున్న విధానం. ఒక్కో విద్యార్థి నుంచి ప్రాక్టికల్స్‌ కోసం రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తాయి. ప్రాక్టికల్స్‌ను నిర్వహించేందుకు ఇంటర్‌ బోర్డు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఎగ్జామినర్లను నియమిస్తుంది. వారికి కార్పొరేట్‌ కాలేజీ యాజమాన్యాలు మామూళ్లు ఇవ్వడం షరామాములుగా జరుగుతుంది. జూనియర్‌ కాలేజీలు మూసివేయడం, ప్రాక్టికల్స్‌ను విద్యార్థులతో చేయించకపోవడంతో ఇప్పుడు అవి జరుగుతాయా? లేదా?అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇంటర్‌ బోర్డు అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వాల్సి

Related Posts