1. పండుగలు, ధార్మిక ఉత్సవములు మరియు వ్రతాలు హిందూ ధర్మములోని అవిభాజ్య అంగములు
వీటిని ఆచరించుటలో విశేషమైన నైసర్గిక, సామాజిక, ఐతిహాసిక మరియు ఆధ్యాత్మిక కారణములు ఉన్నాయి. వీటిని సరియైన పద్ధతిలో ఆచరించుటవలన సమాజములోని ప్రతి వ్యక్తి వారి వ్యక్తిగత మరియు సామాజిక జీవితములో అనేక లాభాలు పొందుతారు. దీనివలన సంపూర్ణ సమాజము యొక్క ఆధ్యాత్మిక అభివద్ధి జరుగుతుంది. అందుకని పండుగలు, ధార్మిక ఉత్సవాలు, మరియు వ్రతాలు ఆచరించుటకు వాటి శాస్త్రాధారాలను, ప్రాముఖ్యతను తెలుసుకొనుట చాలా అవసరము.
2. హోళి
హోళిక రాక్షసి కాదు దేవత
హోళి కూడా సంక్రాంతిలాగ ఒక దేవతయే. షడ్వికారాలపై విజయాన్ని సాధించే సామర్థము హోళికా దేవిలో కలదు. ఈ వికారాలపై విజయాన్ని సాధించే సామర్థమును పొందుటకు హోళికా దేవిని ప్రార్థిస్తారు. అందుకే హోళిని ఉత్సవరూపములో జరుపుకుంటారు.
3. హోళి పండుగకు అగ్నిదేవుని పట్ల కతజ్ఞత వ్యక్తపరుచుటకు కారణము
అగ్నిదేవుని ఉపాసనలో హోళి ఒక భాగమైనది. అగ్నిదేవుని ఉపాసనతో వ్యక్తిలో తేజతత్వము వద్ధి చెందుటకు తోడ్పడుతుంది. హోళి రోజున అగ్నిదేవుడి తత్వము 2శాతము కార్యనిరతరమౌతుంది. అగ్నిదేవుని పూజించుట వలన మనుష్యునిలోని రజో- తమో గుణాల ప్రభావము తగ్గుతాయి. హోళి రోజున చేసే యజ్ఞముల వలన ప్రకతి మానవునికి అనుకూలమౌతుంది. దీని వలన అవసరమైన సమయములో బాగుగా వర్షాలు కురుస్తుండటము వలన సష్టి సంపన్నమౌతుంది. అందుకే హోళి రోజున అగ్నిదేవుని పూజించి కతజ్ఞత వ్యక్తపరచాలి. ఉదయము ఇంటిలో పూజ జరుపుకుంటారు మరియు రాత్రికి సార్వజనికంగా హోళిని జరుపుకుంటారు.
4. హోళి ఆచరించుటకు కారణాలు
పృథ్వి, ఆప, తేజ, వాయు మరియు ఆకాశము ఈ పంచతత్వముల సహయముతో దేవతల తత్వాలను పథ్విపై ప్రక్షేపింప జేయుటకు యజ్ఞము ఒక్కటే మాద్యమమైనది. పథ్విపై ఏ స్పందనతరంగాలు లేనప్పుడు, ప్రథంగా త్రేతాయుగములో పంచతత్వములలో విష్ణుతత్వము ప్రక్షేపించే సమయము వచ్చెను. అప్పుడు పరమేశ్వరుని ద్వారా ఒకేసారి సప్త (ఏడుగరు) ఋషులకు స్వప్నదష్టాంతములో యజ్ఞము గురించి జ్ఞానము కలిగింది. తరువాత వారు యజ్ఞము యొక్క సామగ్రులను తయారు చేయుటకు ప్రారంభించారు. నారదముని యొక్క మార్గదర్శనమునకనుసారంగా యజ్ఞము ప్రారంభమైనది. మంత్రపఠనతో అందరు విష్ణుతత్వమును ఆహ్వానించారు. యజ్ఞము యొక్క జ్వాలతో పాటు యజ్ఞకుండములో విష్ణుతత్వము ప్రక్షేపితమౌతుండెను. దీనితో పథ్విపై ఉన్న అనిష్ట శక్తులకు కష్టమై అవి పారిపోవుట ప్రారంభమైనది. అవి ఈ కష్టము యొక్క కారణము తెలుసుకోలేకపోయాయి. మెల్ల-మెల్లగా శ్రీవిష్ణువు పూర్తి రూపములో సాక్షాత్కారమైనాడు. ఋషిమునులతో పాటు అక్కడ ఉన్న భక్తులందరు శ్రీవిష్ణువు యొక్క దర్శనము పొందారు. ఆ రోజు ఫాల్గుణ పూర్ణిమ. ఈ విధంగా త్రేతాయుగములోని ప్రథమ యజ్ఞము యొక్క గుర్తుగా హోళిని జరుపుకుంటారు. హోళి గురించి శాస్త్రాలలో మరియు పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి.
5. భవిష్యపురాణము యొక్క కథ
భవిష్యపురాణములో ఒక కథ ఉన్నది. ప్రాచీన కాలములో ఢుంఢా మరియు ఢౌంఢ పేరు గల ఇద్దరు రాక్షసులు ఒక ఊరిలో ప్రవేశించి చిన్న పిల్లలను పీడించేవారు. రోగములను మరియు వ్యాధులను కలిగింపజేసేవారు. ఆ రాక్షసులను ఊరిలో నుండి తరిమేయుటకు ప్రజలు ఎంత ప్రయత్నించినను అవి వెళ్ళలేదు. చివరకు ప్రజలు వాటిని చెడు మాటలు తిట్టి, శాపనార్థములు పెట్టి, అంతట నిప్పు అంటించి, భయపెట్టించి వాటిని తరిమివేసారు. అప్పుడు అవి భయపడి పారిపోయాయి. ఈ విధంగా అనేక కథలనుసారంగా భిన్నభిన్న కారణాలవలన ఈ ఉత్సవమును దేశ-విదేశాలలో అనేక రకాలుగా జరుపుకుంటారు. ప్రాంతానుసారంగా ఫాల్గుణ పూర్ణిమ నుండి పంచమి వరకు ఐదు-ఆరు రోజులు, కొన్ని చోట్ల రెండు రోజులు, మరికొన్ని చోట్ల ఐదు రోజుల వరకు ఈ పండుగను జరుపుకుంటారు.
6. హోళి యొక్క మహాత్మము
హోళి యొక్క సంబంధము మనుష్యుని వ్యక్తిగత మరియు సామాజిక జీవనముతో కలిసి ఉంటుంది, అలాగే నైసర్గిక, మానసిక మరియు ఆధ్యాత్మిక కారణాలతో కూడా ముడిపడి ఉంటుంది. ఇది మంచి ద్వారా చెడుపై విజయమును సాధించిన దానికి ప్రతీకము. దుష్టప్రవత్తి మరియు అమంగళకరమైన ఆలోచనలను నాశనము చేసి, సత్ ప్రవత్తి గల మార్గమును చూపించే ఉత్సవము ఇది. అనిష్టశక్తులను నశింపజేసి ఈశ్వరుని చైతన్యమును ప్రాప్తించుకునే దినమిది. ఆధ్యాత్మిక సాధనలో వేగంగా వెళ్ళుటకు బలము ప్రాప్తించుకునే అవకాశమును ఇచ్చేది. వసంత ఋతువు యొక్క ఆగమనము నిమిత్తంగా జరుపుకొనబడే ఉత్సవమిది. అగ్నిదేవుని పట్ల కతజ్ఞత వ్యక్తపరిచే పండుగ ఇది.
7. శాస్త్రానుసారంగా హోళి పండుగను ఆచరించే పద్ధతి
కొన్ని ప్రాంతాలలో హోళి ఉత్సవమును జరుపుకొనుటకు నెల రోజుల ముందు నుండే హోళి పండుగకు కావలసిన వస్తువులను సిద్ధము చేస్తుంటారు. పిల్లలు ప్రతి ఇంటింటికి వెళ్ళి కట్టెలను కూడబెడుతుంటారు. పూర్ణిమ రోజున ఆ కట్టెలను విశిష్ట పద్ధతిలో పెట్టుతారు. తరువాత వాటిని పూజిస్తారు. పూజ జరిపిన తరువాత అగ్నిని ప్రజ్వలింపజేస్తారు. హోళిని వెలిగించే పద్ధతిని తెలుసుకునుటకు దీనిని మనము రెండు భాగాల్లో విభాజించుదాము.
1. హోళి పూజ జరుపుకొనుటకు కావలసిన సామగ్రులు మరియు
2. దాని ప్రజ్వలన
8. హోళిని అలంకరించే పద్ధతి
8(అ). హోళిని అలంకరించుటకు కావలసిన సామగ్రులు
ఆముదము చెట్టు, కొబ్బరి చెట్టు, లేదా పోక చెట్టు యొక్క కర్రలు ఉండవలెను. చెట్టు యొక్క కాండము ఐదు లేదా ఆరు అడుగులు పొడవైనవి ఉండవలెను. ఆవుపేడ పిడకలు, ఇతర కట్టెలు కూడా ఉండవలెను.
8(ఆ) . హోళిని అలంకరించే ప్రత్యక్ష పద్ధతి
సామాన్యంగా గ్రామదేవత ఆలయము ఎదుట హోళిని వెలిగించవలెను. ఇది వీలుకానిచో సౌకర్యవంతంగా ఉన్న స్థలమును ఎన్నుకోవలెను. ఏ స్థలములో హోళిని వెలిగిస్తారో, ఆ స్థలమును సూర్యాస్తమయమునకు ముందు ఊడ్చి శుభ్రపరచవలెను. ఆ తరువాత ఆ స్థలమును పేడతో అలకవలెను. ఆముదము చెట్టు, కొబ్బరిచెట్టు లేదా పోకచెట్టు యొక్క కాండములను (ఏవి ఉన్నాయో అవి) నిలబెట్టవలెను. ఆ తరువాత పిడకలను లేదా కట్టెలను శంఖ ఆకారములో పెట్టి హోళి చుట్టు ముగ్గును వేయవలెను. దీనినే హోళిని శాస్త్రానుసారంగా ఆలంకరించే పద్ధతి అంటారు.
9. హోళి యొక్క శంఖ ఆకారం
9 అ. హోళి యొక్క శంఖ ఆకారము ఇచ్ఛాశక్తికి ప్రతీకమైనది.
9 ఆ. శంఖ ఆకారము వలన పాతాళము నుండి భూగర్భము యొక్క దిశలో ప్రక్షేపించే కష్టదాయక స్పందనతరంగాల నుండి భూమి యొక్క రక్షణ జరుగుతుంది. ఈ శంఖ ఆకారము వలన భూమండలములో విద్యమానమైన స్థానదేవత, వాస్తుదేవత మరియు గ్రామదేవతలాంటి క్షుద్రదేవతల తత్వము జాగతమౌతుంది. అందుచేత భూమండలములో ఉన్న అనిష్టశక్తులు నశింపబడుతాయి.
9 ఇ. శంఖ ఆకారములో ఘనీభూతమై ఉన్న అగ్నిరూప తేజస్సుకు దగ్గర రావడము వలన మనుష్యుని మనఃశక్తి జాగతమగుటకు దోహదపడుతుంది. దీని వలన స్వల్పమైన కోరికలు నెరవేరుతాయి. మనుష్యునికి వాంఛిత ఫలప్రాప్తమౌతుంది.
10. హోళికి తియ్యని పదార్థములను అర్పించుటకు గల శాస్త్రీయ కారణము
హోళిక దేవికి నివేదించుటకు మరియు హోళిలో సమర్పించుటకు ఉడకబెట్టిన శనగ పప్పు మరియు బెల్లము మిశ్రితమైన పదార్థమును తయారు చేస్తారు. దీనిని ‘పూర్ణము’ అని అంటారు. దీనిని నీటితో చిక్కగా కలపిన పిండిలో ముంచి నూనేలో వేగిస్తారు. ఈ తియ్యని పదార్థాన్ని నైవేద్యంగా హోళిని ప్రజ్వలింప జేసిన తరువాత అందులో సమర్పిస్తారు. ఈ నైవేద్యాన్ని నివేదించే వ్యక్తి దేహములో పంచప్రాణములు జాగతమౌతాయి. మిగిలిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించుట వలన మనుష్యునిలో తేజోమయ తరంగాలు సంక్రమిస్తాయి మరియు వారి సూర్యనాడి కార్యనిరతమగుటకు సహాయమౌతుంది. సూర్యనాడి కార్యనిరతమగుటవలన మనుష్యునికి కార్యము చేయుటకు శక్తి లభిస్తుంది.
హోళీకాగ్నిచే మరియు రంగులతో మీ జీవితం ఆనంద రంగులమయం కావాలని ఆకాంక్షిస్తూ...
ఓం నమో నారాయణాయ