అవనిగడ్డ
అవుట్ సౌర్సింగ్ మహిళపై ఏఎస్ డబ్ల్యూవో లైంగిక వేధింపులు గురిచేసారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో సదరు అధికారి గోపాలకృష్ణ పై అవనిగడ్డ పోలీసులు కేసు నమోదు చేసారు. అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలో సాంఘిక సంక్షేమ శాఖలో ఏఎస్ డబ్ల్యూవో గా పనిచేస్తున్న గోపాలకృష్ణ తన సహోద్యోగి మహిళపై అనేక రకాలుగా లైంగిక వేధింపులకు గురిచేసాడని ఆరోపణ.
ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం అవనిగడ్డ పంచాయతీ పరిధిలోని సీతాయిలంకలో నివాసం ఉంటున్న ఓ వివాహిత మహిళ మోపిదేవి ఎస్సీ బాలుర వసతి గృహంలో అవుట్సోర్సింగ్ పద్దతిన హెల్పర్ గా ఉద్యోగం చేస్తోంది. ఆ మహిళను తన కోరిక తీర్చమని ఏఎస్ డబ్ల్యూవో గోపాలకృష్ణ గత కొద్దికాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడని మహిళ పోలీసులను ఆశ్రయించింది. తన కోరిక తీర్చాలని లేదంటే విధులు నుంచి తొలగిస్తామని ఏఎస్ డబ్ల్యూవో బుధవారం తీవ్రస్థాయిలో ఆమెపై ఒత్తిడి తీసుకు రావడంతో పాటు బెదిరింపుకు పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన అవనిగడ్డ డిఎస్పీ మహబూబ్ బాషా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి హుటాహుటిన బాధిత మహిళల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలపై జరిగే అఘాయిత్యాలు ఉపేక్షించబోమని వారు ఎంతటివారైనా కఠినంగా చర్యలు తీసుకుంటామని తీసుకుంటామని మెహబూబ్ భాష అన్నారు. ఈ మేరకు ఏఎస్డబ్ల్యువో లైంగిక వేధింపులకు గురిచేసిన గోపాలకృష్ణ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అవనిగడ్డ డీఎస్పీ తెలిపారు.