న్యూ ఢిల్లీ మార్చ్ 26 ;మయన్మార్‌లో సెక్యూర్టీ దళాలు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన వారి సంఖ్య 300 దాటింది. ఫిబ్రవరి ఒకటో తేదీ తర్వాత మయన్మార్‌లో సైన్యానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని సైన్యం స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ తీవ్ర నిరసనలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారుల్ని అణిచివేస్తున్న జుంటా సైన్యం భారీగా కాల్పులకు తెగించింది. మరణించిన వారిలో 90 శాతం మంది బాధితులు బుల్లెట్లకే ప్రాణాలు కోల్పోయినట్లు మావనహక్కుల సంఘం ద్వారా వెల్లడైంది. దాంట్లో నాలగవ వంతు నిరసనకారులు.. తలలో కాల్చడం వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. అయితే సైనిక అధికారులు మాత్రం 164 మంది నిరసనకారులు మరణించినట్లు చెబుతున్నారు. ఆందోళనకారులు దాడుల్లో 9 మంది భద్రతా దళ సభ్యులు మృత్యువాత పడినట్లు చెప్పారు.
మయన్మార్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలను పాశ్చాత్య దేశాలు ఖండించాయి. పౌరులపై సైన్యం క్రూరమైన అణివేతకు దిగడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ గ్రూపు సేకరించిన లెక్కల ప్రకారం ఇప్పటి వరకు మయన్మార్‌లో 320 మంది మరణించారు. సుమారు మూడవ వేల మంది అరెస్టు అయ్యారు. ఆ గ్రూపు ఇచ్చిన డేటా ప్రకారం మరణించివారిలో 25 శాతం మంది తలలో కాల్చడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. చనిపోయిన వారిలో 90 మంది మగవాళ్లే ఉన్నారు. 24 ఏళ్లు లేదా అంత కన్నా తక్కువ వయసున్నవారిలో 36 శాతం మంది ఉన్నట్లు అడ్వకసీ గ్రూపు పేర్కొన్నది.