న్యూఢిల్లీ మార్చ్ 26
దేశంలో మహమ్మారి ఉధృతి పెరుగుతోంది. వరుసగా రోజువారీ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గతంతో పోలిస్తే పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో కలవరానికి గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 59,118 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. గతేడాది అక్టోబర్ తర్వాత ఇంత మొత్తంలో పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. వైరస్ బారినపడి మరో 257 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,18,46,652కు పెరగ్గా.. మరణాల సంఖ్య 1,60,949కు చేరింది. కొత్తగా 32,987 మంది డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,12,64,637 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,21,066 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 5,55,04,440 డోసులు వేసినట్లు వివరించింది. మరో వైపు దేశంలో కొవిడ్ పరీక్షలు భారీగానే సాగుతున్నాయి. నిన్న ఒకే రోజు 11లక్షలకుపైగా టెస్ట్‌లు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 23,86,04,638 శాంపిల్స్ పరీక్షించినట్లు వివరించింది.