YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

పెండింగ్ కేసులు పరిష్కారం కోసం ఆర్టికల్ 224ఏ.... సుప్రీంకోర్టు తాజాగా కీలక నిర్ణయం

పెండింగ్ కేసులు పరిష్కారం కోసం ఆర్టికల్ 224ఏ....  సుప్రీంకోర్టు తాజాగా కీలక నిర్ణయం

న్యూ ఢిల్లీ  మార్చ్ 26
దేశ అత్యున్నతమైన న్యాయస్థానమైన సుప్రీంకోర్టుతో పాటుగా దేశంలో ఉన్న హైకోర్టుల్లో కొన్ని లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం కొన్నేళ్లుగా ఎన్ని  ప్రయత్నాలు చేస్తున్నా ఆ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఉన్న కేసులకు తోడు కొత్త కేసులతో న్యాయస్ధానాలు ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో  దేశంలో న్యాయ వ్యవస్ధపై నమ్మకం నిలబట్టాలన్నా భవిష్యత్ తరాల్లో విశ్వాసం నింపాలన్నా కఠిన చర్యలు తీసుకోక తప్పని పరిస్ధితి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 224ఏ ప్రకారం తమకు సంక్రమించిన అసాధారణ అధికారాల్ని తొలిసారి వాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. దీంతో సుప్రీంకోర్టు తాజాగా కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు ముందుకు వేస్తుంది.దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లోనే 5 లక్షలకు పైగా పెండింగ్ కేసులున్నట్లు తాజాగా తేల్చారు. దీంతో ఈ కేసుల పరిష్కారం కోసం సుప్రీంకోర్టు అసాధారణ చర్యలకు దిగాల్సిన పరిస్ధితి నెలకొంది. బాథితులకు సత్వర న్యాయం అందించేందుకు వీలుగా ఈ కేసులపై ఏదో ఒకటి తేల్చాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. ఈ కేసుల పరిష్కారం కోసం హైకోర్టుల్లో అదనపు జడ్జీల నియామకం తప్పనిసరి. కానీ ప్రస్తుతం హైకోర్టుల్లో ఉండాల్సిన మేరకు జడ్డీలే లేరు. దీంతో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. దీంతో కొత్తగా హైకోర్టు న్యాయమూర్తుల నియామకంపై సుప్రీంకోర్టు కొలీజియం దృష్టిపెడుతోంది. తాజాగా 45 మంది న్యాయమూర్తులను వివిధ హైకోర్టులకు పంపారు. అదే సమయంలో మరిన్ని ప్రత్యామ్నాయాలపైనా సుప్రీంకోర్టు దృష్టిసారిస్తోంది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో ఉన్న 5 లక్షల పెండింగ్ కేసుల పరిష్కారం కావాలంటే అదనంగా 40 శాతం జడ్డీలను నియమించాల్సి ఉంది. అయితే ఇంతమంది న్యాయమూర్తులను కొత్తగా నియమించాక కూడా అవి పరిష్కారం అవుతాయన్న గ్యారంటీ లేదు. దీంతో అనుభవజ్ఞుల సేవల్ని వినియోగించుకోవాలని సుప్రీం భావిస్తోంది. దీంతో హైకోర్టుల్లో పనిచేసి రిటైర్ అయిన జడ్డీల సేవల్ని వాడుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ ఆర్టికల్ ప్రకారం హైకోర్టు ఛీఫ్ జస్టిస్ లు తప్పనిసరి పరిస్ధితుల్లో రిటైర్డ్ జడ్డీలను రీకాల్ చేసే అధికారం కల్పిస్తోంది. అత్యవసర పరిస్ధితుల్లో హైకోర్టు ఛీఫ్ జస్టిస్ లు తమ హైకోర్టుల్లో లేదా ఇతర హైకోర్టుల్లో జడ్డీలుగా పనిచేసిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు అంగీకారం తెలుపుతూ రాష్ట్రపతికి పేర్లను సూచించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్రపతి దాన్ని పరిశీలించి అంగీకారం తెలుపుతారు.

Related Posts